Salaar: ఆ ఓటీటీలోనే సలార్‌! దిమ్మతిరిగే రేటుకు.. | Prabhas Salaar Movie OTT Partner Details | Sakshi
Sakshi News home page

Salaar: సలార్‌ ఓటీటీ రిలీజ్‌ అందులోనే! స్ట్రీమింగ్‌కు అప్పటినుంచే ఛాన్స్‌!

Published Fri, Dec 22 2023 1:40 PM | Last Updated on Fri, Dec 22 2023 3:17 PM

Prabhas Salaar Movie OTT Partner Details - Sakshi

వరుస డిజాస్టర్లు.. భారీ బడ్జెట్‌ సినిమాలు సైతం బాక్సాఫీస్‌ దగ్గర బొక్క బోర్లా.. మరి ఈసారైనా పాన్‌ ఇండియా హీరోకు హిట్‌ పడుతుందా?.. అని చాలామంది అనుమానించారు. కానీ కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్‌ అన్నట్లుగా సలార్‌ సినిమాలో ప్రభాస్‌ లుక్‌ చూసే ఈ మూవీ హిట్‌ అని బలంగా ఫిక్సయిపోయారు ఫ్యాన్స్‌. వారి అంచనాలకు తగ్గట్లుగా డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌.. ప్రభాస్‌ను మాస్‌ లుక్‌లో చూపించారు. యాక్షన్‌ మోడ్‌లోకి దింపారు.

ఓటీటీ రైట్స్‌..
డిసెంబర్‌ 22న సలార్‌ మూవీని థియేటర్లలో వదిలారు. ఫస్ట్‌ షో నుంచే సినిమాకు హిట్‌ టాక్‌ మొదలైంది. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అయితే రికార్డుల వేట మొదలైందంటూ కాలర్‌ ఎగరేసి మరీ చెప్తున్నారు. ఇదిలా ఉంటే సలార్‌ ఓటీటీ రైట్స్‌ ఎవరు దక్కించుకున్నారన్న విషయం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ దాదాపు రూ.160 కోట్లు పెట్టి మరీ సలార్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం నడుస్తోంది.

సలార్‌ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

ఆ తర్వాతే స్ట్రీమింగ్‌
సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్‌లో రిలీజైన నెల రోజులకే ఓటీటీలోకి తెచ్చేస్తున్నారు. కానీ కొన్నిసార్లు ఆయా చిత్రాలకు వచ్చే ప్రేక్షకుల స్పందనను బట్టి ఓటీటీ రిలీజ్‌లో తేడా ఉంటుంది. ఈ లెక్కన సలార్‌ నెల రోజుల తర్వాతే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే సలార్‌: సీజ్‌ఫైర్‌లో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు ముఖ్యపాత్రలు పోషించారు. హోంబలే ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగందుర్‌ నిర్మించాడు. రవి బస్రూర్‌ సంగీతాన్ని అందించాడు.

చదవండి: ప్రియుడిని పెళ్లాడిన నటి.. జీవితాంతం ఈ చేయి విడవనంటూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement