#SalaarGoesGlobal: నెట్‌ఫ్లిక్స్‌ ఎఫెక్ట్‌.. హాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న సలార్‌ | Hollywood Movie Lovers Comments On Prabhas-starrer Salaar | Sakshi
Sakshi News home page

#SalaarGoesGlobal: నెట్‌ఫ్లిక్స్‌ ఎఫెక్ట్‌.. హాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న సలార్‌

Jan 27 2024 9:52 AM | Updated on Jan 27 2024 10:20 AM

Hollywood Movie Lovers Comments On Salaar - Sakshi

ఖాన్సార్‌ సామ్రాజ్యం నేపథ్యంలో ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన చిత్రం 'సలార్‌'. శ్రుతిహాసన్‌ కథానాయిక. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. వెయ్యి కోట్లు రాబట్టే సత్తా ఉన్నా బాలీవుడ్‌లో ఎలాంటి ప్రమోషన్స్‌ చేయకపోవడంతో ఆ మార్క్‌ను రీచ్‌ కాలేకపోయింది. అంతే కాకుండా డంకీ సినిమాకు కార్పొరేట్‌ బుకింగ్స్‌ జరగడం. సలార్‌కు బాలీవుడ్‌లో పెద్దగా స్క్రీన్స్‌ ఇవ్వకపోవడం వంటివి జరగడంతో కలెక్షన్స్‌పై కొంత ప్రభావం పడింది.

తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న సలార్‌కు ఓటీటీ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇప్పుడు నార్త్‌లో టాప్‌-1లో దూసుకుపోతుంది. టాలీవుడ్‌ నుంచి మొదలైన ప్రభాస్‌ దండయాత్ర పాన్‌ ఇండియా దాటి హాలీవుడ్‌లో అడుగుపడింది. జనవరి 20 నుంచి ఓటీటీలో రన్‌ అవుతున్న సలార్‌  గ్లోబల్​​ ఆడియన్స్‌కు దగ్గరైంది. హాలీవుడ్‌ ప్రేక్షకులు ప్రభాస్‌ కటౌట్‌ చూసి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం #SalaarGoesGlobal హ్యాష్‌ ట్యాగ్‌ ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది.నెట్‌ఫ్లిక్స్‌కు భారత్‌లో కంటే ఫారిన్‌ దేశాల్లోనే సబ్‌స్క్రైబర్స్‌ ఎక్కువ దీంతో వారిలో సలార్‌ను చూసి బాగుందంటూ కామెంట్లు చేయడం విశేషం.

ప్రస్తుతం తెలుగు,తమిళ్‌,కన్నడ,మళయాలం, హిందీ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ఫారిన్ ఆడియెన్స్ నుంచి ఊహించని రేంజ్‌లో క్రేజ్ దక్కుతోంది. వారందరూ ఎక్స్‌ పేజీ ద్వారా సలార్‌పై తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. దీంతో  #SalaarGoesGlobal హ్యాష్‌ ట్యాగ్‌ వైరల్‌ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాను చూసిన అక్కడి ప్రేక్షకులు సలార్‌ సూపర్‌ అంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు. ఇండియన్‌ భాషల్లోనే వారు చూసి ఇలాంటి కామెంట్లు చేస్తే ఇక ఇంగ్లీష్‌ వర్షన్‌ అందుబాటులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు ప్రభాస్‌ కనెక్ట్‌ అయ్యే అవకాశం ఉంది. ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ నుంచి రాబోతున్న కల్కి సినిమా హాలీవుడ్‌ రేంజ్‌లో విజువల్స్‌ ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌లో కూడా విడుదల చేస్తే ప్రభాస్‌ హాలీవుడ్‌కు కూడా దగ్గరయ్యే ఛాన్స్‌ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement