
‘విజయ్.. యస్ టీచర్... నేను నేర్పించిన పాట గుర్తుంది కదా.. పాడు...’ అనే డైలాగ్స్‌తో మొదలై... ‘ప్రతి గాథలో రాక్షసుడే హింసలు పెడతాడు. అణచగనే పుడతాడు రాజే ఒకడు.. శత్రువునే కడ తేర్చే పనిలో మన రాజు.. హింసలనే మరిగాడు.. మంచిని మరిచే...’ అంటూ సాగుతుంది ‘సలార్’ సినిమాలోని ‘ప్రతి గాథలో..’ పాట. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు భాగాలుగా విడుదల కానున్న ‘సలార్’ తొలి భాగం ‘సలార్: సీజ్‌ఫైర్’ చిత్రంలోని పాట ఇది.
శ్రుతీహాసన్ నాయికగా నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, జగపతిబాబు, టీనూ ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. విజయ్ కిరగందూర్ నిర్మించిన ‘సలార్: సీజ్‌ఫైర్’ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘ప్రతి గాథలో..’ పాట లిరికల్ వీడియోను గురువారం విడుదల చేశారు. తెలుగు వెర్షన్‌కు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా, బాల గాయనీ గాయకులు ఈ పాటను పాడారు. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్.
Comments
Please login to add a commentAdd a comment