
గతకొంతకాలంగా డిజాస్టర్లు ఇచ్చిన ప్రభాస్ సలార్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడంతో అతడి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. పాన్ ఇండియా స్టార్ ఇక్కడ, మా హీరో ఎంట్రీ ఇస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు కావాల్సిందేనంటూ కాలర ఎగరేసుకుని మరీ తిరిగారు. ఇక సలార్ మూవీలో ప్రభాస్ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. డైలాగులు తక్కువైనా యాక్షన్ సీన్లతో అదరగొట్టాడు. ఈ మూవీలో ఎమ్మెస్ చౌదరి విలన్‌గా నటించాడు. సలార్ చిత్రంలో ప్రభాస్‌ను కొట్టిన ఏకైక విలన్‌గా దమ్మున్న పాత్రలో యాక్ట్ చేశాడు.
నేను డిస్టర్బ్ చేయను..
తాజాగా అతడు సలార్ సినిమా సంగతులను గుర్తు చేసుకున్నాడు. ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'నేను హీరోలను ఎక్కువగా పలకరించను. ప్రతి ఒక్కరూ వాళ్లతో మాట్లాడాలి, ముచ్చట్లు పెట్టాలి అనుకుంటారు. అలా చేస్తే వారికి విసుగ్గా ఉంటుంది. అందుకని నేను వారిని డిస్టర్బ్ చేయను. వారితో కలిసి సీన్‌లో నటించేటప్పుడు మాత్రం పలకరిస్తుంటాను. ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయినా చాలా సింపుల్‌గా, సరదాగా ఉంటాడు.
డూప్ వద్దని తనే నా కాళ్లు..
సలార్ మూవీలో ప్రభాస్ నా కాళ్లు పట్టుకునే సన్నివేశం ఒకటుంది. అప్పటికే రెండు, మూడు యాంగిల్స్‌లో ఎలా షూట్ చేద్దామా? అని చూస్తున్నారు. మూడోసారికి హీరో డూప్ వచ్చి తాను చేస్తానన్నాడు. కానీ ప్రభాస్ అతడిని వద్దని వారించి తానే చేస్తానని ఆ సీన్ పూర్తి చేశాడు. సలార్ అయిపోయాక ప్రభాస్ బెంగళూరులో పార్టీ ఇచ్చాడు. నేను కూడా ఆ పార్టీకి వెళ్లాను' అని చెప్పుకొచ్చాడు ఎమ్మెస్ చౌదరి.
చదవండి: అప్పుడు విడాకులు.. ఇప్పుడు డేటింగ్.. 45 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి!
పెళ్లైన ఏడాదికే విడిపోతామనుకోలేదు.. విడాకులపై తొలిసారి ఓపెన్ అయిన నిహారిక
Comments
Please login to add a commentAdd a comment