ప్రమాదంలో 'సలార్' నటికి తీవ్రగాయాలు.. వీడియో వైరల్! | Salaar Actress Pooja Vishweshwar Bike Accident In Vizag Video Viral | Sakshi
Sakshi News home page

Salaar Actress: బైక్ యాక్సిడెంట్.. 'సలార్' నటికి ముఖంపై గాయాలు!

Published Sun, Jan 7 2024 9:23 AM | Last Updated on Sun, Jan 7 2024 10:52 AM

Salaar Actress Pooja Vishweshwar Bike Accident In Vizag Video Viral - Sakshi

'సలార్' నటికి యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ముఖమంతా రక్తంతా నిండిపోయింది. ప్రస్తుతం ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అసలేం జరిగిందా? అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఈ ప్రమాదం ఎక్కడ ఎప్పుడు ఎలా జరిగింది? 

(ఇదీ చదవండి: పుట్టిన బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్)

'సలార్' సినిమాలో ఓ ఫైట్ సీన్ బాగా హైలైట్ అయింది. చిన్నపిల్లపై ఓ విలన్ బలత్కారం చేయబోతే హీరో వచ్చి కాపాడుతాడు. మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ఉండే ఈ యాక్షన్ సన్నివేశం బాగా హైలైట్ అయింది. ఈ సీన్‌లో విలన్ పక్కన కళ్లద్దాలు పెట్టుకుని ఓ ఆంటీ యాక్ట్ చేసింది. ఆమె పేరు పూజా విశ్వేశ్వర్. ఈమెది వైజాగ్.

తాజాగా ఈ నటి.. వైజాగ్‌లోని అనకాపల్లి హైవేపై వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయి డివైడర్‌ని ఢీకొట్టింది. దీంతో ఈమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే ఈమెని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈమె త్వరగా కోలుకోవాలని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

(ఇదీ చదవండి: రిలీజ్ డేట్ గందరగోళం.. సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన స్టార్ హీరో మూవీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement