బాక్సాఫీస్ దగ్గర సలారోడు విధ్వంసం సృష్టిస్తున్నాడు. మాస్ ఊచకోతతో థియేటర్లన్నీ రచ్చరచ్చగా మారిపోయాయి. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే భూమ్మీద నిలబడట్లేదు. ఎందుకంటే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేసరికి గోలగోల చేస్తున్నారు. 'సలార్' టాక్ ఏంటి? అందరికీ నచ్చిందా? నచ్చలేదా? అనే విషయాల్ని పక్కనబెడితే మాత్రం ఒక్క విషయం మాత్రం మిస్ అయినట్లు అనిపిస్తుంది.
ప్రభాస్ లాంటి కటౌట్ కి తగ్గ సినిమాలు పడి చాలా ఏళ్లయిపోయింది. 'బాహుబలి' తర్వాత 'సాహో' అనే మాస్ మూవీ వచ్చింది గానీ ఫ్యాన్స్‌ని సంతృప్తి పరచలేకపోయింది. ఇక 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో? దీంతో 'సలార్' కోసం డార్లింగ్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. ఇప్పుడు ఇది థియేటర్లలోకి రావడంతో పాత విషయాలన్నీ మర్చిపోయారు.
(ఇదీ చదవండి: హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా)
అయితే ఓ ఐదు నెలల క్రితం 'సలార్' టీజర్ రిలీజ్ చేశారు. 'కేజీఎఫ్' తాతలా.. ఈ వీడియోలోనూ ఓ తాత, ప్రభాస్‌ని 'డైనోసర్'తో పోల్చడం.. మూవీ లవర్స్‌కి మంచి కిక్ ఇచ్చింది. మొన్నీమధ్య ప్రమోషన్స్‌లోనూ డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ.. డైనోసర్ ఎపిసోడ్ కోసం తాను చాలా వెయిట్ చేస్తున్నానని చెప్పాడు. కానీ ఇప్పుడు జక్కన్న డిసప్పాయింట్ అయ్యాడేమో అనిపిస్తుంది.
ఎందుకంటే తాజాగా థియేటర్లలోకి వచ్చిన 'సలార్ పార్ట్-1'లో ఈ డైనోసర్ ఎపిసోడ్ ఎక్కడా లేదు. బహుశా సీక్వెల్ లో ఉండొచ్చేమో అనిపిస్తుంది. కొంపదీసి దీన్ని ప్రమోషన్ కోసం ఏం షూట్ చేయలేదా కదా అని కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఇంతమంది ఎలివేషన్ సీన్, ప్రభాస్ లాంటి కటౌట్‌కి పడితే థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ. మరి సెకండ్ పార్ట్‌లో అయినా సరే ఉంటుందో లేదో చూడాలి?
(ఇదీ చదవండి: 'సలార్' సీక్వెల్‌కి అదిరిపోయే టైటిల్.. అసలు కథంతా ఇందులోనే!)
Comments
Please login to add a commentAdd a comment