సలార్‌ కలెక్షన్స్‌.. మరో నంబర్‌కు రీచ్‌ అయిన ప్రభాస్‌ | Salaar 18 Days Collection Worldwide | Sakshi
Sakshi News home page

Salaar 18 Days Collections: సలార్‌ కలెక్షన్స్‌.. మరో నంబర్‌కు రీచ్‌ అయిన ప్రభాస్‌

Jan 9 2024 10:30 AM | Updated on Jan 9 2024 10:55 AM

Salaar 18 Days Collection Worldwide - Sakshi

పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులను క్రియేట్‌ చేసింది. గతేడాది వచ్చిన సినిమాల్లో అత్యధికంగా వసూళ్ల వర్షం కురిపించింది. విడుదలైన 18 రోజుల్లో ప్రపంచవ్యప్తంగా ఈ సినిమా రూ.700 కోట్ల మార్క్‌ను దాటినట్లు ప్రముఖ సంస్థ Sacnilk గణాంకాలు చెబుతున్నాయి.  అదే విధంగా భారత్‌లో రూ. 400 కోట్ల మార్క్‌ను చేరుకున్నట్లు పేర్కొంది.

తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్‌లో డంకీ సినిమాతో పోటీగా బరిలోకి దిగింది. దీంతో అక్కడ కొంతమేరకు థియేటర్ల కొరత ఏర్పడింది. అంతేకాకుండా కార్పొరేట్‌ బుకింగ్స్‌ పేరుతో కొందరు సలార్‌ను దెబ్బకొట్టే ప్రయత్నం చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పటికే పలు రికార్డులు క్రియేట్ చేసిన సలార్ మూవీ.. ఇక ఇప్పుడు స్పెయిన్, జపాన్‌లోనూ రిలీజ్ కానుంది. స్పానిష్ భాషలో లాటిన్ అమెరికాలో మార్చి 7న ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.

సినిమా విడుదలయ్యి మూడు వారాలు అయినా సక్సెస్‌ఫుల్‌గా చాలా థియేటర్‌లలో సలార్‌ రన్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం స‌లార్ స‌క్సెస్‌ను తాజాగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని మైత్రి మూవీ మేక‌ర్స్ చిత్ర నిర్మాణ కార్యాలయంలో ప్ర‌భాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్ర‌శాంత్ నీల్ సందడి చేశారు. కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement