'సలార్'కి పోటీగా వస్తున్న పెద్ద సినిమా.. గెలుపు సాధ్యమేనా? | Aquaman and the Lost Kingdom Movie Release With Salaar | Sakshi
Sakshi News home page

Aquaman Vs Salaar: ఆక్వామన్ vs సలార్.. హిట్ కొట్టేది ఎవరు?

Dec 17 2023 4:46 PM | Updated on Dec 17 2023 5:03 PM

Aquaman and the Lost Kingdom Movie Release With Salaar - Sakshi

హాలీవుడ్‌ యాక్షన్‌ అడ్వెంచర్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్వరలో ఈ జానర్‌లో రాబోతున్న మూవీ 'ఆక్వామన్‌ అండ్‌ ది లాస్ట్‌ కింగ్‌ డమ్‌'. గతంలో వచ్చిన 'ఆక్వామన్‌'కి సీక్వెల్‌ ఇది. ఈ రెండు చిత్రాలకూ జేమ్స్‌ వాన్‌ నే డైరెక్టర్. జేసన్‌, ముమోవా, పాట్రిక్‌ విల్సన్‌, అంబర్‌ హార్డ్‌, నీకోల్‌ కిడ్‌ మాన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. 

(ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న హీరో మంచు మనోజ్.. శుభవార్త చెప్పేశారు!)

హీరో.. తన రాజ్యాన్ని, కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి పోరాటం చేశాడు అనే కథతో 'ఆక్వామన్‌ అండ్‌ ది లాస్ట్‌ కింగ్‌ డమ్‌' సినిమా తీశారు. ఫస్ట్ పార్ట్ కంటే మరింతగా భారీగా, అబ్బురపరిచే గ్రాఫిక్స్‌ సీన్స్‌తో ఈ మూవీ తీశామని దర్శకుడు చెప్పాడు. సినిమాలోని ప్రతి సీన్.. ప్రేక్షకులని వింత లోకాలకు తీసుకెళ్తుందన్నారు. కాగా ఈ యాక్షన్‌ అడ్వెంచర్‌ కథా చిత్రాన్ని వార్నర్‌ బ్రదర్స్‌ సంస్థ తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

అయితే 'ఆక్వామన్' సీక్వెల్ రిలీజైన ఒక్కరోజు తర్వాత ప్రభాస్ 'సలార్' థియేటర్లలోకి వస్తుంది. అయితే హాలీవుడ్ మూవీకి ఫ్యాన్స్ ఉండొచ్చు, వీలైనన్నీ థియేటర్లు దొరకొచ్చు. కానీ ప్రభాస్ మూవీ హిట్ అయితే మాత్రం 'ఆక్వామన్' మూవీని ప్రేక్షకులు పట్టించుకుంటారా? లేదా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: Bigg Boss 7: అన్ని లక్షలు ఆఫర్ చేసిన నాగ్.. టైటిల్ రేసు నుంచి ఆ ఒక్కడు డ్రాప్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement