ఆ గుడిలో స్పెషల్ పూజలు చేసిన హీరో ప్రభాస్.. ఎందుకో తెలుసా? | Prabhas Special Pooja At Sri Durga Parameshwari Temple Mangalore | Sakshi
Sakshi News home page

Prabhas: చాలారోజుల తర్వాత దైవసన్నిధిలో ప్రభాస్.. కారణమేంటంటే?

Jan 12 2024 8:59 PM | Updated on Jan 12 2024 9:06 PM

Prabhas Special Pooja At Sri Durga Parameshwari Temple Mangalore - Sakshi

మన డార్లింగ్ ప్రభాస్ చాలారోజుల తర్వాత బయట కనిపించాడు. అది కూడా ఓ గుడిలో స్పెషల్ పూజలు చేస్తూ దర్శనమిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అందరూ ఫస్ట్ షాకయ్యారు. ఎందుకంటే అసలు బయటే పెద్దగా కనిపించని హీరో ప్రభాస్.. ఇలా దైవసన్నిధిలో ప్రత్యక్షమయ్యాడేంటా అనుకున్నరు. కానీ దీని వెనక ఓ కారణముంది. ఇంతకీ అదేంటో తెలుసా?

(ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు మూవీ)

హీరో ప్రభాస్.. 20 రోజుల ముందు 'సలార్' సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. హిట్ కొట్టాడు. అయితే ప్రమోషన్ కూడా ఒక్క ఇంటర్వ్యూతో సరిపెట్టేశారు. ఇది తప్పితే ప్రభాస్ పెద్దగా కనిపించలేదు. మధ్యలో సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు కానీ ఒకటో రెండో ప్రభాస్ ఫొటోలు బయటకొచ్చేసరికి ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోయారు. తాజాగా 'సలార్' గ్రాండ్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రే ఇది జరగనుంది. ఈ క్రమంలోనే కర్ణాటక వెళ్లిన ప్రభాస్.. మంగళూరులోని శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయానికి వెళ్లాడు.

వైట్ క్యాప్, మాస్క్ ధరించిన ప్రభాస్.. 'సలార్' ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్‌తో కలిసి గుడికి వెళ్లాడు. అలానే స్పెషల్ పూజాలు కూడా చేయించాడు. 'సలార్' సినిమా సక్సెస్ అయినందుకే ఈ పూజలు చేయించారన తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ కావడంతో ప్రభాస్.. దైవభక్తి సంగతి అందరికీ  తెలిసింది. ఇకపోతే ప్రభాస్ 'కల్కి' మూవీ రిలీజ్ తేదీని తాజాగా ప్రకటించారు. ఈ ఏడాది మే 9న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు పోస్టర్‌తో సహా అనౌన్స్ చేశారు. 

(ఇదీ చదవండి: టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement