'సలార్' రిలీజ్.. టికెట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! | Andhra Pradesh Government Took Key Decision On Salaar Ticket Rates | Sakshi
Sakshi News home page

Salaar Ticket Rates: ప్రభాస్ సలార్.. టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు!

Published Tue, Dec 19 2023 8:53 PM | Last Updated on Wed, Dec 20 2023 8:57 AM

Andhrapradesh Government Taken Key Decision On Salaar Ticket Rates - Sakshi

ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్‌ చిత్రం ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ మూవీ రిలీజ్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా సలార్ టిక్జెట్ రేట్లు పెంపుపై చిత్రబృందానికి ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. డిస్ట్రిబ్యూటర్స్  విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో రూ.40 రూపాయలు పెంచుకునేందుకు 10 రోజుల వరకు అనుమతి ఇచ్చింది.

కాగా.. ఇప్పటికే సలార్ ట్రైలర్‌ రిలీజ్ ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతిహాసన్ కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌లో ఫుల్‌ యాక్షన్‌తో నింపేశారు. దాదాపుగా అంతా ప్రభాసే కనిపించాడు. అలానే యాక్షన్ సీన్స్‌తో ఫ్యాన్స్‌కు దడ పుట్టించారు. డిసెంబరు 22న 'సలార్' మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇద్దరు స్నేహితులు.. బద్ధ శత్రువులు ఎలా అయ్యారనే స్టోరీతో ఈ సినిమాని తీసినట్లు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పటికే బయటపెట్టడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement