'సలార్' రూట్‌లోనే 'గుంటూరు కారం'.. ప్లాన్ బాగుంది కానీ? | Guntur Kaaram Movie 4AM Benefit Show Is Planning In Telugu States, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Guntur Kaaram Movie: మహేశ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. అది మాత్రం ముందే!

Published Sat, Dec 30 2023 10:09 AM | Last Updated on Sat, Dec 30 2023 12:25 PM

Guntur Kaaram Movie 4AM Benefit Show In Planning Telugu States - Sakshi

'గుంటూరు కారం' పాట ఒక్కసారిగా కాంట్రవర్సీకి కేరాఫ్ అయిపోయింది. 'కుర్చీ మడతపెట్టి' పాట ప్రోమోని రిలీజ్ చేయగా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభిమానులకు ఈ పాటలోని మాస్ నచ్చేయగా.. లిరిక్స్‌పై సగటు మూవీ లవర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. మహేశ్-త్రివిక్రమ్ అసలు ఈ సాంగ్ ఎలా ఒప్పుకొన్నారా అని డౌట్ పడుతున్నారు. ఇలాంటి టైంలో మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకొచ్చింది.

మహేశ్ బాబు మాస్ మూవీ అంటే చాలామందికి 'పోకిరి'నే గుర్తొస్తుంది. ఆ తర్వాత పలు సినిమాలు చేస్తున్నప్పటికీ.. వాటిలో మహేశ్ కూల్ అండ్ క్లాస్ లుక్‌తోనే కనిపిస్తున్నాడు. ఈ మూవీస్ హిట్ అవుతున్నాయి, డబ్బులు కూడా వస్తున్నాయి. కానీ ఫ్యాన్స్ మాత్రం మాస్ మసాలా మూవీస్ మహేశ్ చేయాలని తెగ ఆరాటపడ్డారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు 'గుంటూరు కారం' చేశాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

ప్లస్సో మైనస్సో 'గుంటూరు కారం'పై అంచనాలు పెరుగుతున్నాయి. అభిమానులు కూడా మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు సర్‌ప్రైజ్ ఇచ్చేలా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. మహేశ్ కొత్త మూవీకి బెన్‌ఫిట్ షోలు ప్లాన్ చేస్తున్నారట. 'సలార్‍'కి వేసినట్లు అర్థరాత్రి ఒంటి గంటకు తొలి షో పడేలా ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఇది కుదరకపోతే ఉదయం 4 గంటలకైనా సరే షో పడుతుందని అంటున్నారు.

'గుంటూరు కారం' బెన్‌ఫిట్ షో ప్లాన్ బాగుంది కానీ.. ఈ సినిమా రిలీజ్ అవుతున్న జనవరి 12నే 'హనుమాన్' అనే స్ట్రెయిట్ తెలుగు సినిమా, ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' అనే డబ్బింగ్ మూవీ కూడా థియేటర్లలోకి రానున్నాయి. విడుదల తేదీలు కూడా అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ రెండు చిత్రాల వల్ల మహేశ్ సినిమా కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందా? అని మూవీ లవర్స్ మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ మాజీ భర్తపై దాడి చేసిన యువకుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement