సలార్ ట్రైలర్ విడుదల తేదీ లాక్‌..? | Salaar Trailer Expected To Release In December | Sakshi
Sakshi News home page

Salaar Trailer: సలార్ ట్రైలర్ విడుదల తేదీ లాక్‌ అయిందా..?

Nov 6 2023 12:44 PM | Updated on Nov 6 2023 1:02 PM

Salaar Trailer Expected In December  - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్‌ డిసెంబర్‌ 22న రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలో సలార్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బాహుబ‌లి త‌ర్వాత పెద్ద‌గా హిట్ అందుకోకపోయిన రాధే శ్యామ్‌, ఆదిపురుష్‌ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ బాగానే రాబట్టాయని టాక్‌ ఉంది.

(ఇదీ చదవండి: రష్మిక మందన్న ఫేక్‌ వీడియో వైరల్‌.. ఫైర్‌ అయిన అమితాబ్‌)

కేజీఎఫ్ మొదటి, రెండో భాగాలకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ సలార్‌కు  దర్శకత్వం వహిస్తున్నారు. అలా ఆయనకు పాన్‌ ఇండియాలో గుర్తింపు దొరికింది. అప్పటికే ఆ స్థాయికి రీచ్‌ అయిన ప్రభాస్‌తో సినిమా అంటే అంచనాలు ఊహకు అందడం కష్టమని చెప్పవచ్చు. సలార్‌ ట్రైలర్‌ కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సలార్‌ ట్రైలర్‌ నవంబర్‌ చివరి వారం లేదా డిసెంబర్‌ మొదట్లో రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. భారీ వ్యయంతో సిద్ధమవుతున్న సలార్‌కు సంబంధించిన అప్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. అలాగే పృథ్వీరాజ్, జగపతిబాబు విలన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ కు ప్రాధాన్యమిచ్చి రూపొందిన ఈ చిత్రంలో పోరాట సన్నివేశాల్లో హాలీవుడ్ చిత్రానికి సమాంతరంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు సమాచారం. ఈ సినిమా పోరాట సన్నివేశాల కోసం జీపులు, ట్రక్కులు ఇలా 750 వాహనాలను వినియోగించినట్లు సమాచారం. హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ క్రాకాంతూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ వ్యయంతో రూపొందుతున్న సాలార్ చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబ‌ర్ 22న సాలార్ విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement