ఎన్టీఆర్‌తో ఉన్న ఈమెని గుర్తుపట్టారా? పాన్ ఇండియా డైరెక్టర్ భార్య | Prashanth Neel Wife Likitha Wishes Ntr Birthday | Sakshi
Sakshi News home page

Ntr: తారక్‌తో ఇంత చనువుగా.. ఎవరో చెప్పుకోండి చూద్దాం!

Published Wed, May 22 2024 12:18 PM | Last Updated on Wed, May 22 2024 12:18 PM

Prashanth Neel Wife Likitha Wishes Ntr Birthday

రెండో రోజుల క్రితం ఎన్టీఆర్ పుట్టినరోజు జరుపుకొన్నాడు. ఆల్రెడీ 'దేవర' నుంచి సాంగ్ వచ్చేయడంతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్‌తో చేయబోయే మూవీ అప్డేట్ కూడా వచ్చేసింది. ఆగస్టు నుంచి షూటింగ్ అని నిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారు. ఇంకోవైపు 'వార్ 2' షూటింగ్‌తోనూ తారక్ బిజీ బిజీ. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ ఒకామెతో ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'మైదాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

పైన ఎన్టీఆర్‌తో ఉన్న ఆమె పేరు లిఖితా రెడ్డి. 'కేజీఎఫ్'తో సెన్సేషన్ సృష్టించి, 'సలార్'తో కేక పుట్టించి.. ఇప్పుడు తారక్‌తో రచ్చ లేపేందుకు సిద్ధమయ్యాడు ప్రశాంత్. ఇతడి భార్యనే లిఖితా రెడ్డి. రీసెంట్‌గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఫొటో పోస్ట్ చేసి విషెస్ చెప్పింది. అయితే ఈ ఏడాది మార్చిలో తారక్, తన భార్యతో కలిసి బెంగళూరు వెళ్లాడు. అప్పుడు తీసుకున్న పిక్ ఇది.

ప్రశాంత్ నీల్ అంటే అందరికీ తెలుసు గానీ ఈయన భార్య లిఖితా ఎవరనేది తెలిసింది తక్కువ మందికే. తెలుగు మూలాలున్న అమ్మాయి కావడంతో ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ పెరిగి ఉంటుంది. ఇక తన అభిమాన హీరో ఇంటికొచ్చేసరికి ఆనందం పట్టలేక ఇలా గట్టిగా పట్టుకుని ఫొటో దిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీ ఆగస్టు నుంచి షూటింగ్ మొదలు కానుందని చెప్పారు. అలానే 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్.

(ఇదీ చదవండి: సింపుల్‌గా పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్.. అమ్మాయి ఎవరంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement