
వరుస సినిమాలతో మరింత బిజీ కానున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం ‘దేవర’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ సినిమా తొలి ΄ార్ట్ షూటింగ్ డిసెంబరు కల్లా పూర్తవుతుందని, అప్పట్నుంచి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలోని ‘వార్ 2’ సినిమా సెట్స్‌లో ఎన్టీఆర్ జాయిన్ అవుతారని తెలుస్తోంది.
ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరో. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఓ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ్ర΄ారంభం కానుందని యూనిట్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment