షూటింగ్‌... పార్టీయింగ్‌...  | NTR parties with Ranbir Kapoor and Hrithik Roshan | Sakshi
Sakshi News home page

షూటింగ్‌... పార్టీయింగ్‌... 

Published Tue, Apr 30 2024 12:04 AM | Last Updated on Tue, Apr 30 2024 12:04 AM

NTR parties with Ranbir Kapoor and Hrithik Roshan

ఎన్టీఆర్‌ ముంబైలో బిజీ బిజీగా ఉంటున్నారు. ఓ వైపు షూటింగ్‌లో పాల్గొంటూనే.. మరోవైపు బాలీవుడ్‌ స్టార్స్‌తో పార్టీల్లో సందడి చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ‘వార్‌ 2’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్‌. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ముంబైలో జరుగుతోంది. ఈ మూవీ చిత్రీకరణ కోసం అక్కడే ఉన్నారు ఎన్టీఆర్‌. ‘వార్‌ 2’ షూటింగ్‌లో బిజీ బిజీగా ఉంటున్న ఆయన పార్టీలనూ ఎంజాయ్‌ చేస్తున్నారు.
 

ఈ క్రమంలోనే ముంబైలోని ఓ హోటల్‌లో జరిగిన పార్టీలో సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి పాల్గొన్నారు ఎన్టీఆర్‌. ఈ పార్టీలో బాలీవుడ్‌ హీరోలు హృతిక్‌ రోషన్, రణబీర్‌ కపూర్, హీరోయిన్‌ ఆలియా భట్, దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. పార్టీ జరుగుతున్న హోటల్‌ వద్దకి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ తరలి వచ్చారు. ఎన్టీఆర్‌తో ఫొటోల కోసం వారు ఆసక్తిగా ఎదురు చూశారు. ఓ లేడీ ఫ్యాన్‌ అయితే.. ‘ఎన్టీఆర్‌ సార్‌.. ఈ రోజు నా బర్త్‌ డే.. మీతో సెల్ఫీ దిగాలని ఉంది’ అంటూ రిక్వెస్ట్‌ చేయడంతో.. ఆమెతో ఫొటో దిగారు ఎన్టీఆర్‌. ఇక హిందీలో ‘వార్‌ 2’తో పాటు తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్‌.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement