
హీరో ఎన్టీఆర్, కన్నడ హీరోయిన్ రుక్మిణీ వసంత్ జోడీ కట్టనున్నారా? అంటే అవుననే సమాధానమే ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది.

ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా 19వ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ అనుకుంటున్నారని, ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మికా మందన్నా కనిపిస్తారని గతంలో ప్రచారంలోకి వచ్చింది.

తాజాగా 'సప్త సాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణీ వసంత్ పేరు వినిపిస్తోంది. మరి... ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు? అనేది తెలియాలంటే ఓ నెల రోజులు ఆగాల్సిందే.

ఎందుకంటే ఈ సినిమా చిత్రీకరణను ఈ నెలాఖర్లో ప్రారంభిస్తారు. అయితే జనవరి నుంచి మాత్రమే ఎన్టీఆర్ ఈ షూటింగ్‌లో పాల్గొంటారట. సో... హీరో లేని సన్నివేశాలతో ఈ నెలాఖరు షూట్ ఆరంభమవుతుందని అనుకోవచ్చు.

ఈ సినిమాను 2026 జనవరి 9న రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది.






