డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్' సినిమా ట్రైలర్ రిలీజైంది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని డిసెంబరు 22న థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే 20 రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రియాక్షన్స్ అయితే వస్తున్నాయి.
(ఇదీ చదవండి: 'యానిమల్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అందులోనే)
సినిమా సంగతేంటి?
'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'సలార్'. ఇద్దరు ప్రాణ స్నేహితులు.. బద్ధ శత్రువులైతే ఎలా? అనే లైన్‌తో మూవీ తీసినట్లు స్వయంగా ప్రశాంత్ నీలే చెప్పాడు. అక్టోబరు 28న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. అలా డిసెంబరు 22 అని డేట్ ఫిక్స్ చేశారు.
ట్రైలర్ ఎలా ఉంది?
'సలార్' టీజర్ లో ప్రభాస్ ముఖం చూపించకుండా ఎలివేషన్ ఇచ్చారు. ట్రైలర్‌తో మాత్రం దాదాపు అందరూ మెయిన్ లీడ్స్‌ని చూపించేశారు. ట్రైలర్ చివరలో ప్రభాస్ కనిపించాడు. యాక్షన్ తో అదరగొట్టేశాడు. ఆ ఫైట్ సీన్స్ అన్నీ వేరే లెవల్ హై ఇస్తున్నాయి. రవి బస్రూర్ సంగీతం అలరిస్తోంది. ఓవరాల్‌గా ట్రైలర్ చూస్తుంటే ఈసారి థియేటర్లలో దుమ్మరేగ్గొట్టేలా గ్యారంటీ. అలానే బాక్సాఫీస్‌కి బ్యాండ్ కూడా పక్కా అనిపిస్తోంది.
'సలార్' కథేంటి?
ఖన్సార్ అనే ప్రాంతాన్ని రాజమన్నార్(జగపతిబాబు) అనే వ్యక్తి ఏలుతుంటాడు. ఇతడి కొడుకు వరద రాజమన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్). అయితే రాజమన్నార్ పనిమీద బయటకెళ్లినప్పుడు.. అతడి కొడుకుని అంతమొందించి, ప్రాంతాన్ని చేజిక్కించుకోవాలని కొందరు ప్లాన్ చేస్తుంటాడు. దీంతో వరద రాజమన్నార్, తన చిన్నప్పటి ఫ్రెండ్ దేవా (ప్రభాస్) సహాయం తీసుకుంటాడు. చివరకు ఏమైంది? అనేదే 'సలార్' పార్ట్ 1 స్టోరీ అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: Dhootha Web Series Review: నాగచైతన్య 'దూత' వెబ్ సిరీస్ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment