అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన 'తండేల్' చిత్రం ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా తండేల్ జాతర పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది యాక్టర్‌లను చూసిన వెంటనే ఇష్టం కలుగుతుంది. వారితో పరిచయం లేకపోయినా వాళ్ళని ప్రత్యేకంగా ఇష్టపడతాం. నేను కేడి చిత్ర షూటింగ్ సమయంలో నాగ చైతన్యని తొలిసారి చూశాను. అప్పటి నుంచే చైతు అంటే నాకు చాలా ఇష్టం అన్నారు.
ఇక సాయి పల్లవి గురించి మాట్లాడుతూ.. ప్రేమమ్ చిత్రం దగ్గర నుంచి సాయి పల్లవి నటన అంటే నాకు ఇష్టం. నా అర్జున్ రెడ్డి చిత్రం మొదట తనని హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నాను. కేరళలో సాయి పల్లవిని అప్రోచ్ కావాలని ఒక వ్యక్తిని అడిగాను. అతను స్టోరి ఎంటని అడిగితే లవ్ డెస్ట్రోయ్ అయిన వ్యక్తి స్టోరి అని, ఇది చాలా రొమాంటిక్ మూవీ అని చెప్పా. దానికి సమాధానంగా అతడు వెంటనే.. సార్ ఆ అమ్మాయి గురించి మీరు మరచిపోండి.
ఎందుకంటే సాయి పల్లవి కనీసం స్లీవ్ లెస్ డ్రెస్ కూడా వేసుకోదు అని తనతో చెప్పినట్లు సందీప్ రెడ్డి తెలిపారు. ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు ఒక పెద్ద ఆఫర్ వస్తే గ్లామర్ రోల్స్ చేద్దాం అని అనుకుంటారు. మొదట్లో అలా ఉండి ఆ తర్వాత అవకాశాల కోసం మారిపోతారు. కానీ సాయి పల్లవి వచ్చి ఇన్నేళ్లైనా ఆమె మాత్రం మారలేదు. అది సాయి పల్లవి గొప్పతనం అంటూ సందీప్ రెడ్డి ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment