'అనంతిక'కు సందీప్‌ రెడ్డి గోల్డెన్‌ ఛాన్స్‌ | Ananthi Sunil Kumar to Star in Sandeep Reddy Vanga’s Bhadrakali Pictures Romantic Drama | Sakshi
Sakshi News home page

'అనంతిక'కు సందీప్‌ రెడ్డి గోల్డెన్‌ ఛాన్స్‌

Sep 24 2025 7:23 AM | Updated on Sep 24 2025 10:49 AM

Actress Ananthika sanilkumar will be movie with Director Sandeep Reddy vanga

మ్యాడ్ సినిమాతో అనంతిక సనీల్ కుమార్ టాలీవుడ్‌లో పాపులర్‌ అయింది.. అయితే, 8 వసంతాలు సినిమాతో ఆమె క్రేజ్‌ మరింత పెరిగింది. ఈ మూవీలో ఆమె నటించిన తీరు చాలామందిని ఆకట్టుకుంది. 19 ఏళ్లకే కరాటే, కళరిపయట్టు, కత్తిసాము వంటి విద్యల్లో నైపుణ్యం పొందిన ఈ కేరళ బ్యూటీకి దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా మరో ఛాన్స్‌ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

సందీప్‌ రెడ్డి సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్‌పై ఇప్పటికే అర్జున్‌ రెడ్డి, యానిమల్‌ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు అనంతిక సనీల్ కుమార్‌తో ఒక ప్రాజెక్ట్‌ను ప్లాన్‌ చేస్తున్నారట.. అయితే, ఈ చిత్రానికి సందీప్‌ నిర్మాతగా మాత్రమే  ఉండనున్నారు. ఈ సినిమాతో వేణు అనే కొత్త దర్శకుడుని ఆయన పరిచయం చేయనున్నారని సమాచారం. ఈ మూవీ తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక చక్కటి ప్రేమకథగా ఉండనుందని టాక్‌. ఈ చిత్రంలో సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్నారట. ‘మేం ఫేమస్‌’ చిత్రంతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement