ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం యానిమల్. టాలీవుడ్ డైరెక్టర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ట్రైలర్ చూడాగనే చిత్రంపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. ఈ సినిమా రిలీజ్ రోజు దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ సందీప్, హీరో, హీరోయిన్ యానిమల్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.
అయితే వీరంతా ఓ టీవీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యానిమల్ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అయితే ఈ షో మధ్యలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. షోలో పాల్గొన్న వీరు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు ఫోన్ కాల్ చేశారు. ఫోన్‌లో విజయ్ మాట్లాడుతుండగా స్పీకర్ ఆన్ చేశారు.
అర్జున్ రెడ్డి సినిమా గురించి ఫోన్‌లో రష్మిక మాట్లాడుతుండగా.. అక్కడే ఉన్న రణ్‌బీర్ కపూర్ మధ్యలో మాట్లాడారు. అసలు రష్మికను సందీప్ రెడ్డి మొదటిసారి అర్జున్ రెడ్డి మూవీ సక్సెస్ పార్టీలో విజయ్ వాళ్ల మేడపై కలిశారంటూ అనుకోకుండానే నిజం చెప్పేశారు రణ్‌బీర్. దీంతో ఒక్కసారిగా షాకైన రష్మిక ఈ విషయాలన్నీ ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు సార్ అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. రణ్‌బీర్ కామెంట్స్‌తో విజయ్-రష్మిక జోడీపై మరోసారి డేటింగ్ రూమర్స్ వైరలవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment