
తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు బాలీవుడ్ ఎప్పటికీ మరిచిపోదు. కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆయన క్రియేట్ చేసుకున్నాడు. సందీప్ రెడ్డి టేకింగ్‌తో పాటు సీన్స్, స్క్రీన్ ప్లేకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో బాక్సాఫీస్ వద్ద తన సినిమాలు భారీ వసూళ్లు కొల్లగొట్టాయి. దీంతో సందీప్‌పై అక్కడి ప్రొడక్షన్ హౌస్‌లే కాకుండా కొందరు దర్శకులు కూడా వారి కడుపు మంట చూపారు. అయితే, వారికి సరైన రీతిలో సందీప్ కౌంటర్స్ ఇచ్చారు. తాజాగా మరోసారి బాలీవుడ్‌పై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.

రణబీర్‌పై పొగడ్తలు సరే.. మరి దర్శకుడి సంగతేంటి..?
హిందీ చిత్రపరిశ్రమపై మరోసారి సందీప్ రెడ్డి ఇలా కామెంట్లు చేశారు. 'బాలీవుడ్ ప్రముఖులు యానిమల్ సినిమాను తిట్టారు. కానీ, అందులో నటించిన హీరో రణబీర్ కపూర్‌ను మాత్రం విపరీతంగా పొగడటమే కాకుండా తన పాత్రను మెచ్చుకున్నారు. సినిమాను తిట్టిన వారే రణబీర్ కపూర్‌ను ఎలా అభినందిస్తారు.. ఇక్కడ రణబీర్ అంటే నాకు ఎలాంటి కోపం లేదు. కానీ, వారు చూపిన తేడా ఏంటో నాకు ఆ సమయంలో అర్ధం కాలేదు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే..? నన్ను తిట్టినట్లు రణబీర్‌ను టార్గెట్ చేస్తే ఏమౌతుందో వారందరికీ తెలుసు. ఆయనతో మళ్లీ వారు సినిమాలు చేయలేరు. అందుకే నాపై సులభంగా కామెంట్లు చేశారు. బాలీవుడ్‌కు నేను కొత్త.. ఒక దర్శకుడు రెండు, మూడేళ్లకు ఒక సినిమా తీస్తాడు. కానీ, ఒక నటుడు అయితే ఏడాదికి పలుమార్లు కనిపిస్తూనే ఉంటాడు. నటుడితో వారికి ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి వాళ్లను ఏమీ అనలేరు.' అని సందీప్ స్పందించాడు.

నా సినిమాలో నటించాడని అతనికి ఛాన్స్‌లు ఇవ్వలేదు
షాహిద్ కపూర్‌తో తెరకెక్కించిన కబీర్ సింగ్ (అర్జున్ రెడ్డి రీమేక్) సినిమా గురించి సందీప్ రెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు. కబీర్ సింగ్ సినిమాలో నటించిన ఒక స్టార్ యాక్టర్ ముంబైలోని ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్‌కు ఆడిషన్స్ కోసం వెళ్తే వారు రిజక్ట్ చేశారని వంగా వెల్లడించాడు. 'కేవలం నా సినిమాలో ఆయన నటించిన పాపానికి వారు కాదని చెప్పారు. ఇంతటి వివక్ష బాలీవుడ్‌లో మాత్రమే ఉంది. ఇలాంటి నిర్ణయమే రణ్‌బీర్ సింగ్ విషయంలో తీసుకోవాలని బాలీవుడ్‌కు సవాల్ విసురుతున్నాను. కబీర్ సింగ్ సినిమా నటీనటులపై ప్రొడక్షన్ హౌస్ ఇంత కఠినమైన విధానాలను కలిగి ఉంటే ఎలా..? ఇదే విషయాన్ని ఒకసారి రణ్‌బీర్ కపూర్‌కి కూడా చెప్పాను.
విభిన్న పాత్రల కోసం ఆడిషన్స్ చేస్తూ ఇండస్ట్రీలో ఎదగాలని ప్రయత్నిస్తున్న ఒక యంగ్ టాలెంటెడ్ నటుడిపై నా వల్ల వివక్ష చూపడం నాకు చాలా బాధగా అనిపించింది.' అని సందీప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నటుడి ప్రతిభ కంటే అతని గత సినిమాను బట్టి ప్రొడక్షన్ హౌస్ తిరస్కరించడం చాలా దర్మార్గం అంటూ బాలీవుడ్‌ను విమర్శించాడు. కబీర్ సింగ్ హీరో షాహిద్ కపూర్ గురించే సందీప్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. అర్జున్ రెడ్డి రీమేక్‌గా బాలీవుడ్‌లో కబీర్ సింగ్ విడుదలైంది. అయితే, ఈ సినిమా తర్వాత షాహిద్ కపూర్‌కు ఛాన్సులు తగ్గాయి. సుమారు మూడేళ్లకు జెర్సీ సినిమాతో మళ్లీ తెరపైకి వచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment