వడోదర: పేసర్ జయదేవ్ ఉనాద్కట్ (5/45) పదునైన బంతుల ధాటికి అస్సాం జట్టు విలవిలలాడింది. దీంతో పది వికెట్ల తేడాతో నెగ్గిన సౌరాష్ట్ర జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. మూడో రోజు సోమవారం తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన అస్సాం 39.1 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. సయ్యద్ మొహమ్మద్ (69 బంతుల్లో 39; 5 ఫోర్లు) టాప్ స్కోరర్. రాథోడ్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం 21 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన సౌరాష్ట్ర 3.1 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 24 పరుగులు చేసి నెగ్గింది. అంతకుముందు తమ తొలి ఇన్నింగ్స్‌ను 353 పరుగుల వద్ద ముగించింది.
మరో సెమీస్‌లో మధ్యప్రదేశ్‌తో తలపడుతున్న ముంబై 429 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 70 ఓవర్లలో 285/3 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ (97 బ్యాటింగ్), ఆదిత్య తారే (90 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులు చేసింది.
రంజీ ఫైనల్లో సౌరాష్ట్ర
Published Tue, Feb 16 2016 12:08 AM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM
Advertisement