Ranji final
-
అద్భుతమై ఇన్నింగ్స్ ఆడిన సచిన్.. తృటిలో సెంచరీ మిస్
కేరళ, విదర్భ (Kerala Vs Vidarbha) జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ (Ranji Trophy Final) హోరాహోరీగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించేందుకు ఇరు జట్లు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 379 పరుగులకు ఆలౌటైంది. యువ ఆటగాడు దనిశ్ మలేవార్ (153) సూపర్ సెంచరీతో విదర్భ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. అతనికి కరుణ్ నాయర్ (86) సహకరించాడు. అనంతరం బరిలోకి దిగిన కేరళ విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను దాటేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది.ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్ సచిన్ బేబి (Sachin Baby) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేరళను తొలి ఇన్నింగ్స్ సాధించే దిశగా తీసుకెళ్లాడు. అయితే దురదృష్టవశాత్తు సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో 235 బంతులు ఎదుర్కొన్న సచిన్.. 10 బౌండరీల సాయంతో 98 పరుగులు చేశాడు. సచిన్‌తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ ఆదిత్య సర్వటే (79) కేరళ ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశాడు. సర్వటే.. అహ్మద్ ఇమ్రాన్ (37), సచిన్ బేబి సహకారంతో అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అనంతరం సచిన్.. సల్మాన్ నిజర్ (21), మహ్మద్ అజహరుద్దీన్ (37), జలజ్ సక్సేనా (28 నాటౌట్) సాయంతో కేరళ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.మూడో రోజు మూడో సెషన్ సమయానికి కేరళ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. జలజ్ సక్సేనా, ఏడెన్ యాపిల్ టామ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు కేరళ ఇంకా 42 పరుగులు వెనుకపడి ఉంది. తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధిస్తే ఈ మ్యాచ్ డ్రా అయినా కేరళనే విజేతగా నిలుస్తుంది. కాబట్టి తొలి ఇన్నింగ్స్ లీడ్ కోసం ఇరు జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి.ఇబ్బంది పెట్టిన నల్కండేఈ ఇన్నింగ్స్‌లో కేరళకు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్లు అక్షయ్ చంద్రన్ (14), రోహన్ కన్నుమ్మల్ను (0) దర్శన్ నల్కండే తెగ ఇబ్బంది పెట్టాడు. వీరిద్దరినీ నల్కండే 13 పరుగుల వ్యవధిలో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో నల్కండే ఈ రెండు వికెట్లతో పాటు మరో వికెట్ కూడా తీశాడు. సెమీఫైనల్లో సెంచరీ హీరో మహ్మద్ అజహరుద్దీన్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. విదర్భ బౌలర్లలో నల్కండేతో పాటు హర్ష్ దూబే (2), యశ్ ఠాకూర్ (1), పార్థ్ రేఖడే (1) వికెట్లు తీశారు.అంతకుముందు విదర్భ ఇన్నింగ్స్‌లో మలేవార్, కరుణ్ నాయర్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. 11వ నంబర్ ఆటగాడు నచికేత్ భూటే (32) మలేవార్, కరుణ్ నాయర్ తర్వాత టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధృవ్ షోరే (16), యశ్ ఠాకూర్ (25), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (23), అక్షయ్ కర్నేవార్ (12), హర్ష్ దూబే (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. పార్థ్ రేఖడే (0), దర్శన్ నల్కండే (1), యశ్ రాథోడ్ (3) పూర్తిగా నిరాశపరిచారు. కేరళ బౌలర్లలో నిదీశ్, ఈడెన్ యాపిల్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బాసిల్ 2, జలజ్ సక్సేనా ఓ వికెట్ దక్కించుకున్నారు.కాగా, విదర్భ సెమీఫైనల్లో ముంబైను చిత్తు చేసి ఫైనల్‌కు చేరగా.. కేరళ గుజరాత్‌పై 2 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి తొలిసారి ఫైనల్‌కు చేరింది. -
రంజీ ట్రోఫీ ఫైనల్.. విదర్భ భారీ స్కోర్.. పోరాడుతున్న కేరళ
రంజీ ట్రోఫీ 2024-25 (Ranji Trophy) ఎడిషన్ ఫైనల్లో గతేడాది రన్నరప్ విదర్భ (Vidarbha), తొలిసారి ఫైనల్‌కు చేరిన కేరళ (Kerala) తలపడుతున్నాయి. విదర్భలోని నాగ్‌పూర్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కేరళ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (379) చేసింది. యువ ఆటగాడు దనిశ్ మలేవార్ (153) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. స్టార్ ఆటగాడు కరుణ్ నాయర్ (86) అతనికి సహకరించాడు. దురదృష్టవశాత్తు కరుణ్ సెంచరీకి ముందు రనౌటయ్యాడు. విదర్భ ఇన్నింగ్స్‌లో వీరిద్దరు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. 11వ నంబర్ ఆటగాడు నచికేత్ భూటే (32) మలేవార్, కరుణ్ నాయర్ తర్వాత టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధృవ్ షోరే (16), యశ్ ఠాకూర్ (25), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (23), అక్షయ్ కర్నేవార్ (12), హర్ష్ దూబే (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. పార్థ్ రేఖడే (0), దర్శన్ నల్కండే (1), యశ్ రాథోడ్ (3) పూర్తిగా నిరాశపరిచారు. కేరళ బౌలర్లలో నిదీశ్, ఈడెన్ యాపిల్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బాసిల్ 2, జలజ్ సక్సేనా ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఓపెనర్లు అక్షయ్ చంద్రన్ (14), రోహన్ కన్నుమ్మల్ (0) నిరాశపర్చగా.. ఆదిత్య సర్వటే (66 నాటౌట్), అహ్మద్ ఇమ్రాన్ (37) సాయంతో కేరళ ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ చేసిన సర్వటే.. కెప్టెన్ సచిన్ బేబితో (7) కలిసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కండే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 14 పరుగులకే ఇద్దరు కేరళ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపాడు. యశ్ ఠాకూర్ క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న ఇమ్రాన్‌ను పెవిలియన్‌కు పంపాడు. కేరళ.. విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 248 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, విదర్భ సెమీఫైనల్లో ముంబైను చిత్తు చేసి ఫైనల్‌కు చేరగా.. కేరళ గుజరాత్‌పై 2 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించింది. -
రంజీ ఫైనల్లో శతక్కొట్టిన యువ కెరటం
రంజీ ట్రోఫీ 2024-25 (Ranji Trophy) ఎడిషన్ ఫైనల్ (Ranji Final) మ్యాచ్ ఇవాళ (ఫిబ్రవరి 26) మొదలైంది. గతేడాది రన్నరప్ విదర్భ (Vidarbha).. తొలిసారి ఫైనల్‌కు చేరిన కేరళతో (Kerala) తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో కేరళ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బౌలింగ్ చేసిన కేరళకు ఆదిలోనే ఫలితం లభించింది. ఆ జట్టు బౌలర్ నిధీశ్ మ్యాచ్ రెండో బంతికే విదర్భ ఓపెనర్ పార్థ్ రేఖడేను (0) ఔట్ చేశాడు. అనంతరం నిధీశ్ ఏడో ఓవర్లో మరో వికెట్ తీశాడు. 11 పరుగుల స్కోర్ వద్ద నిధీశ్ దర్శన్ నల్కండేను (1) పెవిలియన్‌కు పంపాడు. మరికొద్ది సేపటికే విదర్భ మూడో వికెట్ కోల్పోయింది. ఈసారి ఏడెన్ యాపిల్ టామ్ కేరళకు సక్సెస్ అందించాడు. టామ్.. విదర్భ స్టార్ బ్యాటర్ ధృవ్ షోరేను (16) ఔట్ చేశాడు. ఫలితంగా విదర్భ 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.Danish Malewar in his last 13 innings 👏61, 46, 42, 59, 115, 17, 13, 3, 75, 0, 79, 29, 104*(still batting)#RanjiTrophy2025pic.twitter.com/HmdjKiXaOm— CricTracker (@Cricketracker) February 26, 2025సెంచరీతో కదంతొక్కిన దనిశ్ మలేవార్ఈ దశలో 21 ఏళ్ల దనిశ్ మలేవార్ (Danish Malewar) సెంచరీతో కదంతొక్కి విదర్భను మళ్లీ మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు. దనిశ్ 168 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. దనిశ్ తన సెంచరీ మార్కును సిక్సర్, బౌండరీతో అందుకున్నాడు. దనిశ్కు స్టార్ ఆటగాడు కరుణ్ నాయర్ (Karun Nair) సహకారం అందిస్తున్నాడు. కరుణ్ సైతం అర్ద సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దనిశ్, కరుణ్ నాలుగో వికెట్‌కు అజేయంగా 158 పరుగులు జోడించారు. 63 ఓవర్లు ముగిసే సరికి విదర్భ స్కోర్ 183/3గా ఉంది. దనిశ్ 116.. కరుణ్ 51 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నారు.భీకర ఫామ్‌లో దనిశ్దనిశ్ ప్రస్తుత రంజీ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్లో దనిశ్ 13 ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 600 పైచిలుకు పరుగులు చేశాడు. ఫైనల్లో సెంచరీతో మెరిసిన దనిశ్.. క్వార్టర్ ఫైనల్, సెమీస్‌లో అర్ద సెంచరీలతో రాణించాడు. దనిశ్ ఇదే సీజన్‌తో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆంధ్రతో జరిగిన అరంగ్రేటం మ్యాచ్‌లోనే అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం వరుసగా 46, 42, 59, 115, 17, 13, 3, 75, 0, 79, 29, 118* పరుగులు స్కోర్ చేశాడు. -
కేరళ కల సాకారం.. కష్టానికి తోడైన అదృష్టం.. తొలిసారి రంజీ ఫైనల్లోకి ప్రవేశం
‘ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది’ అనే నానుడి కేరళ జట్టుకు సరిగ్గా సరిపోతుంది. 68 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ... 352 మ్యాచ్‌ల పోరాటం అనంతరం కేరళ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీలో ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్లో అద్వితీయ ప్రదర్శన కనబరుస్తున్న కేరళ జట్టు... తీవ్ర ఉత్కంఠ మధ్య మాజీ చాంపియన్ గుజరాత్‌తో జరిగిన సెమీఫైనల్లో పైచేయి సాధించి తొలిసారి తుదిపోరుకు చేరింది. క్వార్టర్ ఫైనల్లో ఒక్క పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో జమ్మూకశ్మీర్‌ను వెనక్కి నెట్టిన కేరళ... ఇప్పుడు సెమీఫైనల్లో గుజరాత్‌పై రెండు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముందంజ వేసింది. ఒక్క పరుగే కదా అని తేలికగా తీసుకుంటే ... ఎలాంటి ఫలితాలు వస్తాయో ప్రత్యర్థికి రుచి చూపింది. ఆరు దశాబ్దాల పోరాటం అనంతరం దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీ ఫైనల్‌కు చేరిన కేరళ జట్టు ప్రస్థానంపై ప్రత్యేక కథనం.. సుదీర్ఘ కాలంగా రంజీ ట్రోఫీ ఆడుతున్న కేరళ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయింది. ముంబై, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, బెంగాల్ మాదిరిగా తమ జట్టులో స్టార్ ప్లేయర్లు లేకపోయినా... నిలకడ కనబరుస్తున్నప్పటికీ ఆ జట్టు తుదిపోరుకు మాత్రం అర్హత సాధించలేదు. తాజా సీజన్లో అసాధారణ పోరాటాలు, అనూహ్య ఫలితాలతో ఎట్టకేలకు కేరళ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ చేరి చరిత్ర సృష్టించింది. జమ్మూ కశ్మీర్‌తో హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో 1 పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సెమీఫైనల్లో అడుగుపెట్టిన కేరళ జట్టు... సెమీస్‌లో మాజీ చాంపియన్ గుజరాత్‌పై 2 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో తమ చిరకాల కల నెరవేర్చుకుంది.నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్ చివరి రోజు కేరళ జట్టు అద్భుతమే చేసింది. చేతిలో 3 వికెట్లు ఉన్న గుజరాత్ జట్టు తుదిపోరుకు అర్హత సాధించాలంటే మరో 29 పరుగులు చేయాల్సిన దశలో తొలి ఇన్నింగ్స్ కొనసాగించగా... కేరళ జట్టు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టిపడేసింది. అప్పటికే క్రీజులో పాతుకుపోయి మొండిగా పోరాడుతున్న గుజరాత్ బ్యాటర్లు జైమీత్ పటేల్, సిద్ధార్థ్ దేశాయ్‌లను కేరళ బౌలర్ ఆదిత్య వెనక్కి పంపాడు. ఇంకేముంది మరో వికెట్ తీస్తే చాలు కేరళ తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ చేరడం ఖాయమే అనుకుంటే... ఆఖరి వికెట్‌కు అర్జాన్ నాగ్వస్వల్లా, ప్రియజీత్ సింగ్ జడేజా మొండిగా పోరాడారు.పది ఓవర్లకు పైగా క్రీజులో నిలిచిన ఈ జంటను చూస్తే ఇక మ్యాచ్ కేరళ చేజారినట్లే అనుకుంటున్న తరుణంలో అర్జాన్ కొట్టిన షాట్ కేరళకు కలిసొచ్చింది. ఆదిత్య వేసిన బంతిని అర్జాన్ బలంగా బాదే ప్రయత్నం చేశాడు. బంతి షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సల్మాన్ నిజార్ హెల్మెట్‌కు తాకి గాల్లోకి లేచి ఫస్ట్ స్లిప్‌లో ఉన్న కెప్టెన్ సచిన్ బేబీ చేతిలో పడింది. అంతే కేరళ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. స్టార్లు లేకుండానే... స్టార్ ఆటగాడు సంజూ సామ్సన్ భారత జట్టులో ఉండగా... అనుభవజ్ఞులైన విష్ణు వినోద్, బాబా అపరాజిత్ వంటి వాళ్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. అయినా ఈ సీజన్లో కేరళ జట్టు స్ఫూర్తివంతమైన ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా మిడిలార్డర్లో కెప్టెన్ సచిన్ బేబీతో పాటు సీనియర్ ప్లేయర్ జలజ్ సక్సేనా... యువ ఆటగాళ్లు మొహమ్మద్ అజహరుద్దీన్, సల్మాన్ నిజార్ అసమాన పోరాటం కనబర్చారు.జమ్మూ కశ్మీర్‌తో క్వార్టర్స్ పోరులో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసేందుకు సల్మాన్, అజహరుద్దీన్ కనబర్చిన తెగువను ఎంత పొగిడినా తక్కువే. 40 ఓవర్లకు పైగా జమ్మూ బౌలర్లను కాచుకున్న ఈ జంట వికెట్ ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించి తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన ఒక్క పరుగు ఆధిక్యంతో సెమీఫైనల్‌కు చేరింది.తాజాగా గుజరాత్‌తో సెమీస్‌లోనూ తొలి ఇన్నింగ్స్‌లో కేరళ బ్యాటర్లు అసాధరణ ప్రదర్శన కనబర్చారు. సచిన్ బేబీ 195 బంతుల్లో 69 పరుగులు, జలజ్ సక్సేనా 83 బంతుల్లో 30 పరుగులు, అజహరుద్దీన్ 341 బంతుల్లో 177 పరుగులు, సల్మాన్ నిజార్ 202 బంతుల్లో 52 పరుగులు చేసి గుజరాత్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ముందు నుంచే చక్కటి గేమ్ ప్లాన్‌తో మైదానంలో అడుగుపెట్టిన కేరళకు చివర్లో అదృష్టం కూడా తోడవడంతో చక్కటి విజయంతో తొలిసారి రంజీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ టోర్నీ చరిత్రలో కేరళ జట్టు ఇప్పటి వరకు అత్యుత్తమంగా 2018–19 సీజన్లో సెమీఫైనల్‌కు చేరింది.నిరీక్షణకు తెరదించుతూ.. తొమ్మిది దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్న రంజీ ట్రోఫీలో కేరళ జట్టు 1957లో అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి ఒక్కటంటే ఒక్కసారి కూడా ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఫుట్‌బాల్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చే కేరళ వాసులు... క్రికెట్‌ను పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కానీ గత రెండు దశాబ్దాల్లో కేరళ క్రికెట్లో అనూహ్య మార్పు వచ్చింది. 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన శ్రీశాంత్ స్ఫూర్తితో మరెందరో ఆటగాళ్లు క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నారు.అందుకు తగ్గట్లే గత కొన్నేళ్లుగా కేరళలో క్రీడా మౌలిక వసతులు మరింత మెరుగు పడటంతో ప్రతిభావంతులు వెలుగులోకి రావడం మొదలైంది. అయితే ఇది ఒక్క రోజులో సాధ్యమైంది కాదు. దీని వెనక ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉంది. అందుకే శుక్రవారం సెమీస్‌లో కేరళ జట్టు విజయానికి చేరువవుతున్న సమయంలో ప్రసార మాధ్యమాల్లో వీక్షకుల సంఖ్య ఒక్కసారిగా లక్షల్లో పెరిగింది. ప్రతిష్టాత్మక టోర్నీలో కేరళ టీమ్ ఫైనల్‌కు చేరగానే సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు... తామే గెలిచినంతగా లీనమైపోయి జట్టును అభినందనల్లో ముంచెత్తారు. మౌలిక వసతుల్లో భేష్.. సాధారణంగా అధిక వర్షపాతం నమోదయ్యే కేరళలో ఒకప్పుడు నిరంతరం అవుట్డోర్ ప్రాక్టీస్ చేయడం కూడా కష్టతరంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఆ రాష్ట్ర వ్యాప్తంగా 17 ఫస్ట్‌క్లాస్ మైదానాలు అందుబాటులోకి వచ్చాయంటే కేరళ క్రికెట్లో ఎంత పురోగతి సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ కృషి వల్లే కేవలం పెద్ద నగరాల నుంచే కాకుండా... ద్వితీయ శ్రేణి పట్టణాలకు చెందిన ప్రతిభావంతులైన ఆటగాళ్లు కూడా రంజీ జట్టులో చోటు దక్కించుకోగలుగుతున్నారు.‘ముంబై, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ వంటి ఇతర జట్లతో పోల్చుకుంటే... కేరళ జట్టు ఎంపిక విభిన్నంగా ఉండేది. పరిమితమైన వనరులు మాత్రమే ఉండటంతో అందుబాటులో ఉన్నవాళ్లనే ఎంపిక చేసేవాళ్లం. ముందు ఆ పరిస్థితి మారాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో అకాడమీలను స్థాపించాం. కేవలం ప్లేయర్లకే కాకుండా కోచ్‌లకు కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. మౌలిక వసతులపై ప్రధానంగా దృష్టి పెట్టాం. ఒకప్పుడు వర్షం వస్తే ప్రాక్టీస్ ఆగిపోయేది. ఇప్పుడు ఇండోర్‌లోనూ నెట్స్ ఏర్పాటు చేశాం.2005లో రాష్ట్రంలో ఒక్క మైదానంలో కూడా లేదు. ఇప్పుడు మొత్తం 17 ఫస్ట్‌క్లాస్ గ్రౌండ్లు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో మరే రాష్ట్రంలో లేనంతమంది బీసీసీఐ లెవల్1 కోచ్‌లు కేరళలో ఉన్నారు’ అని బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు మాథ్యూ తెలిపారు.కేరళ క్రికెట్ సంఘం కృషి వల్లే స్వేచ్ఛగా ఆడగలుగుతున్నామని... సెమీఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కించుకున్న అజహరుద్దీన్ వెల్లడించాడు. పరస్పర సహకారం, సమష్టితత్వంతో ముందుకు సాగడం వల్లే మెరుగైన ఫలితాలు వస్తున్నాయని అన్నాడు. ఈనెల 26 నుంచి నాగ్‌పూర్‌లో జరిగే తుది పోరులోనూ కేరళ విజయం సాధిస్తే 10 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ చాంపియన్‌గా నిలిచిన దక్షిణాది జట్టుగా నిలుస్తుంది... ఆల్ ద బెస్ట్ కేరళ..! -
ముంబైపై ప్రతీకారం తీర్చుకున్న విదర్భ.. వరుసగా రెండో సీజన్లో ఫైనల్లోకి ఎంట్రీ
రంజీ ట్రోఫీ 2024-25 (Ranji Trophy) చివరి అంకానికి చేరింది. ఈ సీజన్లో తొలి ఫైనల్ బెర్త్ అధికారికంగా ఖరారైంది. రెండో సెమీఫైనల్లో ముంబైని (Mumbai) ఓడించి విదర్భ (Vidarbha) వరుసగా రెండో సీజన్లో ఫైనల్‌కు చేరింది. గత సీజన్ ఫైనల్లో ముంబై చేతిలో ఎదురైన పరాభవానికి విదర్భ ఈ సీజన్ సెమీస్‌లో ప్రతీకారం తీర్చుకుంది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో జరిగిన సెమీ ఫైనల్లో ముంబైపై విదర్భ 80 పరుగుల తేడాతో గెలుపొందింది. విదర్భ నిర్దేశించిన 406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై 325 పరుగులకు ఆలౌటైంది. హర్ష్ దూబే 5, యశ్ ఠాకూర్, పార్థ్ రేఖడే తలో రెండు వికెట్లు తీసి ముంబైని దెబ్బకొట్టారు. ముంబై ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ భారీ స్కోర్లు చేయలేదు.ముంబై ఓటమి ఖరారైన తర్వాత శార్దూల్ ఠాకూర్ (66) అర్ద సెంచరీ సాధించాడు. షమ్స్ ములానీ (46) సాయంతో శార్దూల్ ముంబైని గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. స్టార్ బ్యాటర్లు అజింక్య రహానే (12), శివమ్ దూబే (12), సూర్యకుమార్ యాదవ్ (23) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఆకాశ్ ఆనంద్ 39 పరుగులకు ఔటయ్యాడు. యువ ఆటగాళ్లు ఆయుశ్ మాత్రే (18), సిద్దేశ్ లాడ్ (2) నిరాశపరిచారు. ఆఖర్లో తనుశ్ కోటియన్ (26), మోహిత్ అవస్తి (26), రాయ్స్టన్ డయాస్ (23) కంటితడుపు చర్చగా బ్యాట్‌ను ఝులిపించారు.ఈ మ్యాచ్‌లో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. దృవ్ షోరే (74), దినిశ్ మాలేవార్ (79), యశ్ రాథోడ్ (54) అర్ద సెంచరీలతో రాణించగా.. కరుణ్ నాయర్ (45), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అథర్వ తైడే 4, పార్థ్ రేఖడే 23, హర్ష్ దూబే 18, భూటే 11, యశ్ ఠాకూర్ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. దర్శన్ నల్కండే 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై బౌలర్లలో శివమ్ దూబే ఐదు వికెట్లతో రాణించగా.. షమ్స్‌ములానీ, రాయ్స్టన్ డయాస్ తలో రెండు, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తీశారు.అనంతరం బరిలోకి దిగిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకే ఆలౌటైంది. స్టార్ బ్యాటర్లు, టీమిండియా ప్లేయర్లు అజింక్య రహానే (18), సూర్యకుమార్ యాదవ్ (0), శివమ్ దూబే (0) దారుణంగా విఫలమయ్యారు. ఆకాశ్ ఆనంద్ (106) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి సూపర్ సెంచరీతో ముంబై పరువు కాపాడాడు. ఆకాశ్ ఆనంద్‌కు సిద్దేశ్ లాడ్ (35), శార్దూల్ ఠాకూర్ (37), తనుశ్ కోటియన్ (33) కాసేపు సహకరించారు. విదర్భ బౌలర్లలో పార్థ్ రేఖడే 4, యశ్ ఠాకూర్, హర్ష్ దూబే తలో 2, దర్శన్ నల్కండే, భూటే చెరో వికెట్ పడగొట్టారు.113 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ.. 292 పరుగులకు ఆలౌటై ముంబై ముందు కొండంత లక్షాన్ని ఉంచింది. యశ్ రాథోడ్ 151 పరుగులు చేసి విదర్భ ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. యశ్‌కు కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (52) సహకరించాడు. వీరిద్దరి నుంచి ఈ స్థాయి ఇన్నింగ్స్‌లు రాకపోయుంటే విదర్భ ముంబై ముందు ఇంత భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయేది. విదర్భను రెండో ఇన్నింగ్స్‌లో షమ్స్ ములానీ దెబ్బకొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో ములానీ ఆరు వికెట్లు తీశాడు. తనుశ్ కోటియన్ 3, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టారు. గుజరాత్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్ డ్రా దిశగా సాగుతున్నప్పటికీ.. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన లీడ్ (2 పరుగులు) ఆధారంగా కేరళ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. రంజీల్లో కేరళ ఫైనల్‌కు చేరనుండటం ఇదే మొదటిసారి. ఈ సీజన్ ఫైనల్లో విదర్భ, కేరళ తలపడనున్నాయి. -
చరిత్ర సృష్టించనున్న కేరళ.. 91 ఏళ్ల రంజీ చరిత్రలో తొలిసారి..!
కేరళ క్రికెట్ జట్టు (Kerala Cricket Team) చరిత్ర సృష్టించనుంది. 91 ఏళ్ల రంజీ ట్రోఫీ (Ranji Trophy) చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించనుంది. గుజరాత్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో కేరళ 2 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. తద్వారా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోనుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేయగా.. గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం ఆట చివరి రోజు కొనసాగుతుంది. కేరళ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం అసాధ్యం. రంజీ రూల్స్ ప్రకారం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జట్టు విజేత నిలుస్తుంది. తద్వారా కేరళ ఫైనల్‌కు చేరుతుంది.దీనికి ముందు కేరళ కార్టర్ ఫైనల్లోనూ ఇలాగే స్వల్ప ఆధిక్యం సాధించి సెమీస్‌కు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో కేరళ.. జమ్మూ అండ్ కశ్మీర్‌పై ఒక్క పరుగు లీడ్ సాధించింది. ఫలితంగా సెమీస్‌కు అర్హత సాధించింది.1957-58 సీజన్లో తొలిసారి రంజీ బరిలోకి దిగిన కేరళ.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్‌కు అర్హత సాధించలేదు. 2018-19 సీజన్లో సెమీస్‌కు చేరినా.. తుది పోరుకు అర్హత సాధించలేకపోయింది. 1957/58కి ముందు కేరళ ట్రావన్‌కోర్-కొచ్చిన్ టీమ్‌గా రంజీల్లో ఆడింది.మ్యాచ్ విషయానికొస్తే.. వికెట్‌కీపర్ బ్యాటర్ మహ్మద్ అజహరుద్దీన్ భారీ సెంచరీతో (177 నాటౌట్) కదంతొక్కడంతో కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేసింది. కేరళ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సచిన్ బేబి (69), సల్మాన్ నిజర్ (52) అర్ద సెంచరీలతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో సగస్వల్లా 3, చింతన్ గజా 2, పి జడేజా, రవి బిష్ణోయ్, విశాల్ జేస్వాల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ప్రియాంక్ పంచల్ (148) సెంచరీతో కదంతొక్కడంతో గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో ఆర్య దేశాయ్ (73), జయ్‌మీత్ పటేల్ (79) అర్ద సెంచరీలతో రాణించారు. కేరళ బౌలర్లలో సర్వటే, జలజ్ సక్సేనా తలో 4 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు సైతం బాగానే బ్యాటింగ్ చేసినప్పటికీ.. కేరళ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు రెండు పరుగుల దూరంలో నిలిచిపోయారు. చివరి రోజు లంచ్ సమయానికి కేరళ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. రోహన్ కన్నుమ్మల్ (15), అక్షయ్ చంద్రన్ (9) క్రీజ్‌లో ఉన్నారు.విదర్భతో జరుగుతున్న మరో సెమీఫైనల్లో ముంబై ఓటమి అంచుల్లో నిలిచింది. 406 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలవాలంటే మరో 226 పరుగులు సాధించాలి. స్టార్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు చేరడంతో ఈ మ్యాచ్‌లో ముంబై గెలవడం అసాధ్యం. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయినా తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా విదర్భ ఫైనల్‌కు చేరుతుంది. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులు చేయగా.. ముంబై 270 పరుగులకే పరిమితమైంది. కాగా, గత సీజన్ ఫైనల్లో ముంబై.. విదర్భను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. -
Ranji Trophy: ఉత్కంఠ పోరులో ఘన విజయం.. మూడోసారి ఫైనల్‌కు
నాగ్‌పూర్: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో విదర్భ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆఖరి రోజు వరకు రసవత్తరంగా సాగిన సెమీస్‌లో మధ్యప్రదేశ్‌ను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించింది. ఆఖరి మెట్టుపై ముంబైతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. నాగ్‌పూర్ వేదికగా మధ్యప్రదేశ్- విదర్భ మధ్య రంజీ తాజా ఎడిషన్ తొలి సెమీ ఫైనల్ జరిగింది. శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విదర్భ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మధ్యప్రదేశ్ బౌలర్ల దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 170 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ 252 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. వికెట్ కీపర్ హిమాన్షు మంత్రి అద్భుత శతకం(126) కారణంగా ఈ మేరకు మెరుగైన స్కోరు సాధించింది. విదర్భపై 82 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విదర్భ 402 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆరో నంబర్ బ్యాటర్ యశ్ రాథోడ్ సూపర్ సెంచరీ(141), కెప్టెన్, వికెట కీపర్ బ్యాటర్ అక్షయ్ వాడ్కర్ అద్భుత అర్ధ శతకం(77) కారణంగా మధ్యప్రదేశ్‌కు దీటుగా బదులివ్వగలిగింది. మధ్యప్రదేశ్‌కు 321 పరుగుల లక్ష్యం విధించింది. ఈ క్రమంలో మంగళవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 71 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. గెలుపు దక్కాలంటే మధ్యప్రదేశ్ మరో 93 పరుగులు చేయాల్సి ఉండగా... నాలుగు వికెట్లు పడగొడితే విదర్భ మూడోసారి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకునే స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో బుధవారం నాటి ఐదో రోజు ఆటను 228/6 ఓవర్‌నైట్ స్కోరుతో మొదలుపెట్టిన మధ్యప్రదేశ్.. ఆరంభంలోనే కుమార్ కార్తికేయ(4), అతడి స్థానంలో వచ్చిన అనుభవ్ అగర్వాల్(6) వికెట్లు కోల్పోయింది. నైట్‌వాచ్ మన్ సారాంశ్ జైన్ ఆవేశ్ ఖాన్‌తో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు బౌల్డ్ కావడంతో.. మధ్యప్రదేశ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో 81.3 ఓవర్ వద్ద ఖెజ్రోలియా(11) బౌల్డ్ అవడంతో మధ్యప్రదేశ్ ఓటమి ఖరారైంది. 𝐕𝐢𝐝𝐚𝐫𝐛𝐡𝐚 𝐚𝐫𝐞 𝐢𝐧𝐭𝐨 𝐭𝐡𝐞 𝐟𝐢𝐧𝐚𝐥! 🙌🙌 They beat Madhya Pradesh by 62 runs in a tightly fought contest. A terrific comeback from the Akshay Wadkar-led side 👌@IDFCFIRSTBank | #VIDvMP | #RanjiTrophy | #SF1 Scorecard ▶️ https://t.co/KsLiJPuqXr pic.twitter.com/YFY1kaO1x7 — BCCI Domestic (@BCCIdomestic) March 6, 2024 విదర్భ 62 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది. అద్భుత శతకంతో విదర్భ విజయంలో కీలక పాత్ర పోషించిన యశ్ రాథోడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. కాగా అంతకుముందు మరో సెమీస్ మ్యాచ్‌లో ముంబై తమిళనాడుపై గెలిచి రికార్డు స్థాయిలో 48వ సారి ఫైనల్లో ప్రవేశించింది. ఇక విదర్భ ఫైనల్ చేరడం ఇది మూడోసారి. మార్చి 10న ముంబై, విదర్భ టైటిల్ కోసం పోటీ మొదలుపెట్టనున్నాయి. Timber Strikes 🔥 Vidarbha wrapped it up early today, picking up the remaining 4️⃣ wickets to enter the final. 👌@IDFCFIRSTBank | #VIDvMP | #RanjiTrophy | #SF1 Scorecard ▶️ https://t.co/KsLiJPuYMZ pic.twitter.com/ny6DYBQ7bM — BCCI Domestic (@BCCIdomestic) March 6, 2024 -
రంజీలు కాదు.. దేశమే ముందు
కోల్‌కతా: భారత సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో రంజీ ఫైనల్ ఆడించాలనుకున్న సౌరాష్ట్ర క్రికెట్ సంఘా నికి (ఎస్సీఏ) నిరాశ ఎదురైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ... జడేజా రంజీ ఫైనల్ ఆడేందుకు అనుమతి నిరాకరించాడు. దేశమే ముందని, ఆ తర్వాతే ఏదైనా టోర్నీలని గంగూలీ తెగేసి చేప్పేశాడు. టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం సన్నద్ధమవుతోంది. ఈ నెల 12న ధర్మశాలలో ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగుతుంది. మరోవైపు సోమవారం నుంచి రాజ్‌కోట్‌లో సౌరాష్ట్ర, బెంగాల్ జట్ల మధ్య రంజీ ట్రోఫీ ఫైనల్ జరుగనుంది. కీలకమైన ఫైనల్స్‌లో జడేజాను ఆడించేందుకు ఎస్సీఏ అధ్యక్షుడు జయదేవ్ షా బీసీసీఐ చీఫ్ గంగూలీని కోరాడు. కానీ తన అభ్యర్థనను గంగూలీ తిరస్కరించాడని షా చెప్పాడు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన జయదేవ్ రంజీ ఫైనల్ ఉన్నప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించరాదన్నాడు. ‘ఐపీఎల్ ఉన్నపుడు బోర్డు అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించదు. ఎందుకంటే లీగ్ ద్వారా బాగా డబ్బు వస్తుంది. రంజీ ట్రోఫీకి ఆదరణ దక్కాలంటే స్టార్ ఆటగాళ్లను ఆడించాల్సిందే. ఆ దిశగా బోర్డు ఆలోచించాలి. రంజీ ఫైనల్ జరిగే రోజుల్లో అంతర్జాతీయ మ్యాచ్ లేకపోతే స్టార్ ఆటగాళ్లందరూ అందుబాటులో ఉంటారు. మ్యాచ్ రసవత్తరంగా జరిగేందుకు అవకాశముంటుంది. ఆదరణ కూడా పెరుగుతుందని జయదేవ్ షా తెలిపాడు. -
రంజీ ఫైనల్లో సౌరాష్ట్ర
వడోదర: పేసర్ జయదేవ్ ఉనాద్కట్ (5/45) పదునైన బంతుల ధాటికి అస్సాం జట్టు విలవిలలాడింది. దీంతో పది వికెట్ల తేడాతో నెగ్గిన సౌరాష్ట్ర జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. మూడో రోజు సోమవారం తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన అస్సాం 39.1 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. సయ్యద్ మొహమ్మద్ (69 బంతుల్లో 39; 5 ఫోర్లు) టాప్ స్కోరర్. రాథోడ్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం 21 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన సౌరాష్ట్ర 3.1 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 24 పరుగులు చేసి నెగ్గింది. అంతకుముందు తమ తొలి ఇన్నింగ్స్‌ను 353 పరుగుల వద్ద ముగించింది. మరో సెమీస్‌లో మధ్యప్రదేశ్‌తో తలపడుతున్న ముంబై 429 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 70 ఓవర్లలో 285/3 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ (97 బ్యాటింగ్), ఆదిత్య తారే (90 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులు చేసింది.