ఢిల్లీ: రాజస్థార్ రాయల్స్ పేసర్ జయ్‌దేవ్ ఉనాద్కత్ పెద్ద మనసు చాటుకున్నాడు. కరోనా కట్టడి కోసం భారత్ సాగిస్తున్న పోరులో ఉనాద్కత్ తనవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. వైద్య సదుపాయాలు, అత్యవసరాలు కోసం తన ఐపీఎల్ శాలరీలో 10 శాతం విరాళంగా ఇవ్వనున్నట్లు ఉనాద్కత్ ప్రకటించాడు. ఉనాద్కత్ ఐపీఎల్ శాలరీ రూ. 3 కోట్లు కాగా అందులో 10 శాతాన్ని విరాళంగా ఇవ్వనున్నాడు. ఈ మేరకు వీడియోను ట్వీటర్‌లో విడుదల చేశాడు. ‘ కరోనా బాధితులు ఎంత నరకం అనుభవిస్తున్నారో నాకు తెలుసు. కరోనా మనుషులతో ఆటలాడుకుంటోంది. కరోనా ఎఫెక్ట్‌తో నానా బాధలు పడుతున్న వారి వద్ద నా మనసు ఉంది. ఈ సమయంలో నా వంతు సాయంగా 10 శాతం ఐపీఎల్ శాలరీని విరాళంగా ఇవ్వాలనుకుంటున్నా.
మనకు అత్యంత దగ్గరగా ఉండే స్నేహితులే కరోనాతో పోరాటం చేస్తున్నారు. వారి బాధ వర్ణణాతీతం. ఈ సమయంలో క్రికెట్ ఆడటం మంచిదా.. కాదా అనే విషయం నేను చెప్పలేను. ప్రస్తుతం కుటుంబాలకు దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉది. ఐపీఎల్‌తో కొంతవరకూ అయినా ఎంజాయ్‌మెంట్ దొరకుతుందనే అనుకుంటున్నా. మనమంతా ఒకరికోసం ఒకరు ఐక్యంగా ఉండాలి. కరోనాతో బలంగా పోరాడటమే మనముందున్న కర్తవ్యం. ఈ పరిస్థితుల్లో మనకు చేతనైనా సాయం చేయడం మనధర్మం’ అని ఉనాద్కత్ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. ఇప్పటికే పలువురు క్రికెటర్లు తమ ఔదర్యాన్ని చాటుకుంటూనే ఉన్నారు. కేకేఆర్ ఆటగాడు ప్యాట్ కమిన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు శ్రీవత్స్ గోస్వామి, ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రెట్ లీ తదితరులు సాయం చేసిన వారిలో ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ కూడా కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు రూ 7.5 కోట్లు విరాళంగా ఇచ్చింది.
I am contributing 10% of my IPL salary towards providing essential medical resources for those in need. My family will make sure it reaches the right places. Jai Hind! pic.twitter.com/XvAOayUEcd
— Jaydev Unadkat (@JUnadkat) April 30, 2021
ఇక్కడ చదవండి: స్వదేశానికి వెళ్లే మార్గాలను అన్వేషిస్తున్నాం: మ్యాక్సీ
పృథ్వీ షాకు ఐదు అవార్డులు.. గర్ల్‌ఫ్రెండ్ సెటైర్
Comments
Please login to add a commentAdd a comment