PC: IPL.com
టీమిండియా వెటరన్ పేసర్ జయదేవ్ ఉనద్కట్ ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో అత్యధిక జట్ల తరపున బరిలోకి దిగిన భారత ఆటగాడిగా ఉనద్కట్ అవతరించాడు. ఐపీఎల్-202లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున బరిలోకి దిగిన జయదేవ్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఉనద్కట్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 7 జట్ల తరపున ఆడాడు.
2010లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఉనద్కట్.. అనంతరం 2013లో ఆర్సీబీ, 2014లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, 2017లో పుణే సూపర్ జెయింట్స్, 2018లో రాజస్తాన్ రాయల్స్‌కు పప్రాతినిథ్యం వహించాడు. అయితే నాలుగు సీజన్లకు పాటు రాజస్తాన్ తరపున ఆడిన జయదేవ్‌ను.. ఐపీఎల్-2022కు ముందు రాయల్స్ విడిచిపెట్టింది.
అనంతరం మెగా వేలంలోకి వచ్చిన అతడిని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అయితే ముంబై కూడా అతడిని ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు విడిచిపెట్టింది. ఐపీఎల్-2023 మినీవేలంలో లక్నో సొంతం చేసుకుంది. ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ తొలి స్థానంలో ఉన్నాడు. ఫించ్ ఐపీఎల్‌లో 8 జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.
చదవండి: పగ తీర్చుకున్న శ్రీలంక.. షాక్‌లో న్యూజిలాండ్! సూపర్ ఓవర్‌లో
Comments
Please login to add a commentAdd a comment