
జైపూర్: సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనాద్కత్‌కు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఐపీఎల్ సీజన్ 12 కోసం ప్రారంభమైన ఆటగాళ్ల వేలంలో ఈ లెఫ్టార్మ్ బౌలర్ మరోసారి రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. ఏకంగా రూ. 8.40 కోట్ల ధరకు రాజస్తాన్ రాయల్స్ ఈ ఆటగాడిని కొనుగోలు చేసింది. గత ఐపీఎల్ సీజన్‌లోనూ రూ.11.5 కోట్లకు రాజస్థానే కోనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే గత ఐపీఎల్‌లో ఉనాద్కత్ (15 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు) పూర్తిగా నిరాశపరిచినప్పటికీ అతడిపై రాజస్థాన్ ఫ్రాంచైజీ నమ్మకం ఉంచింది. ఇక ఈ ఆటగాడి కోసం పలు ఫ్రాంచైజీలు పోటిపడటం విశేషం. ఇప్పటివరకూ జరిగిన వేలంలో హనుమ విహారి జాక్‌పాట్ కొట్టాడు. అతని కనీస ధర రూ. 50 లక్షలుండగా, రూ. 2 కోట్లకు ఢిల్లీ కేపిటల్స్ కొనుగోలు చేసింది. ఇక కార్లోస్ బ్రాత్‌వైట్ ను రూ. రూ. 5 కోట్లకు కేకేఆర్, హెట్‌మెయిర్‌ను రూ. 4.20 కోట్లకు ఆర్సీబీ, వృద్దిమాన్ సాహాను రూ.1.2 కోట్లకు సన్‌రైజర్స్, లసింత్ మలింగాను రూ.2 కోట్లకు ముంబై ఇండియన్స్, ఇషాంత్ శర్మను రూ.1.1 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్, వరుణ్ ఆరోన్‌ను రూ.2.4 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment