
ఆలూర్ (బెంగళూరు): కీలక సమయంలో బ్యాట్స్‌మెన్ బోల్తా పడటంతో విజయ్‌హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టుకు మూడో ఓటమి ఎదురైంది. సోమవారం ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 14 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లాడిన హైదరాబాద్ 4 మ్యాచ్‌ల్లో గెలుపొంది మూడింటిలో ఓడింది. ముంబైతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. బెంగళూరులోని ఆలూరు క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ను 23 ఓవర్లకు కుదించి ఆడించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఛత్తీస్‌గఢ్ 23 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. అశుతోష్ సింగ్ (50 బంతుల్లో 66; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. అతను అమన్‌దీప్ (24)తో నాలుగో వికెట్‌కు 53 పరుగులు, శశాంక్ సింగ్ (31 నాటౌట్)తో 50 పరుగులు జోడించి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. హైదరాబాద్ బౌలర్లలో సీవీ మిలింద్ 2 వికెట్లు పడగొట్టాడు.
సిరాజ్, రవికిరణ్, మెహదీ హసన్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం హైదరాబాద్ జట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. తన్మయ్ అగర్వాల్ (6), అక్షత్ రెడ్డి (14), హిమాలయ్ అగర్వాల్ (3), కెప్టెన్ అంబటి రాయుడు (22; 1 ఫోర్, 1సిక్స్) రాణించలేకపోయారు. తిలక్ వర్మ (37 బంతుల్లో 41; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడు కనబరిచాడు. చివర్లో మిలింద్ (7)తో కలిసి బావనక సందీప్ (39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడటంతో జట్టు స్కోరు 18.4 ఓవర్లలో 147/6 నిలిచింది. అయితే చివరి 26 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి ఉండగా హైదరాబాద్ వరుస బంతుల్లో సందీప్, మిలింద్ వికెట్లను కోల్పోయింది. తర్వాత మెహదీ హసన్ (0), సిరాజ్ (0)లు కూడా పరుగులేమీ జోడించకుండానే పెవిలియన్ చేరడంతో అదే స్కోరు వద్ద హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది.
స్కోరు వివరాలు
ఛత్తీస్‌గఢ్ ఇన్నింగ్స్: రిషభ్ తివారి (సి) మల్లికార్జున్ (బి) సిరాజ్ 2; శశాంక్ చంద్రకర్ (ఎల్బీడబ్ల్యూ) మెహదీ హసన్ 18; అశుతోష్ సింగ్ (సి) తిలక్ వర్మ (బి) మిలింద్ 66; హర్‌ప్రీత్ సింగ్ భాటియా (బి) మిలింద్ 16; అమన్‌దీప్ ఖరే (సి) సందీప్ (బి) రవికిరణ్ 24; శశాంక్ సింగ్ (నాటౌట్) 31; అజయ్ మండల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (23 ఓవర్లలో 5 వికెట్లకు) 171.
వికెట్ల పతనం: 1–3, 2–31, 3–58, 4–111, 5–161.
బౌలింగ్: సిరాజ్ 5–0–27–1, రవికిరణ్ 5–0–36–1, మిలింద్ 5–0–46–2, మెహదీహసన్ 4–0–16–1, సందీప్ 3–0–30–0, తిలక్ వర్మ 1–0–11–0.
హైదరాబాద్ ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) శశాంక్ (బి) వీర్ ప్రతాప్ సింగ్ 6; అక్షత్ రెడ్డి (సి) అమన్‌దీప్ (బి) పంకజ్ రావు 14; తిలక్ వర్మ (సి) రిషభ్ తివారీ (బి) వీర్ ప్రతాప్ సింగ్ 41; హిమాలయ్ అగర్వాల్ (సి) పునీత్ (బి) పంకజ్ రావు 3; అంబటి రాయుడు (సి) హర్‌ప్రీత్ సింగ్ (బి) అజయ్ మండల్ 22; సందీప్ (సి) అశుతోష్ సింగ్ (బి) శశాంక్ సింగ్ 39; మల్లికార్జున్ (సి) శశాంక్ సింగ్ (బి) అజయ్ మండల్ 11; మిలింద్ (బి) శశాంక్ సింగ్ 7; మెహదీహసన్ (సి) అమన్‌దీప్ (బి) వీర్ ప్రతాప్ సింగ్ 0; సిరాజ్ (సి) అశుతోష్ సింగ్ (బి) వీర్ ప్రతాప్ సింగ్ 0; రవికిరణ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 147.
వికెట్ల పతనం: 1–7, 2–30, 3–34, 4–86, 5–91, 6–107, 7–147, 8–147, 9–147, 10–147.
బౌలింగ్: పంకజ్ రావు 4–0–13–2, వీర్ ప్రతాప్ సింగ్ 3.5–0–23–4, పునీత్ 3–0–23–0, అజయ్ 5–0–24–2, శశాంక్ సింగ్ 4–0–61–2.