విజయ్ హజారే ట్రోఫీ-2024లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై జట్టుకు పంజాబ్ ఊహించని షాకిచ్చింది. ఈ టోర్నీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 48.5 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది.
పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 5 వికెట్లతో ముంబైను దెబ్బతీశాడు. శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే వంటి కీలక వికెట్లను అర్షదీప్ తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబై బ్యాటర్లలో అంకోలేకర్(66) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యన్ష్ షెగ్దే(44), శార్ధూల్ ఠాకూర్(43) రాణించారు.
ప్రభసిమ్రాన్ ఊచకోత..
అనంతరం 249 పరుగుల లక్ష్య చేధనలో ప్రభసిమ్రాన్ సింగ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను ప్రభసిమ్రాన్ ఊచకోత కోశాడు. కేవలం 101 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో 150 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
అతడితో పాటు అభిషేక్ శర్మ(66) హాఫ్ సెంచరీతో రాణించాడు. ముంబై బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్, అయూష్ మాత్రే తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఐపీఎల్-2025కు ముందు ప్రభసిమ్రాన్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకుంది.
చదవండి: 'భారత క్రికెట్ చరిత్రలో ఇదే మొదటి సారి'.. రోహిత్‌పై ఎమ్ఎస్కే ఫైర్
Comments
Please login to add a commentAdd a comment