రైతుల వద్దకు రాహుల్ గాంధీ | Congress Vice-President Rahul Gandhi to Begin 'Kisan Padyatra' | Sakshi
Sakshi News home page

రైతుల వద్దకు రాహుల్ గాంధీ

Published Thu, Apr 30 2015 10:22 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

రైతుల వద్దకు రాహుల్ గాంధీ - Sakshi

రైతుల వద్దకు రాహుల్ గాంధీ

నాగ్పూర్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం కిసాన్ పాదయాత్ర ప్రారంభించారు. రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా చోటుచేసుకునే మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని గ్రామాల గుండా రోజుకు పది హేను కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకోనున్నారు. తొలుత గంజి అనే గ్రామానికి చేరుకున్న ఆయన అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులతో మాట్లాడారు.

అనంతరం ఆయన ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను కూడా పరామర్శించనున్నారు. రాహుల్ తోపాటు పార్టీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. ప్రధాని నరేంద్రమోదీ రైతులను చిన్నచూపు చూస్తున్నారని, ఆత్మహత్యలు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తీవ్రంగా బుధవారం పార్లమెంటులో విమర్శించిన విషయం తెలిసిందే. రైతులు దేశాన్ని నిర్మించలేరా అని ఆయన మోదీని నిలదీశారు కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement