IPL 2023, RCB Vs LSG: Avesh Khan Throws Away Helmet To Celebrate Win Over RCB, Video Viral - Sakshi
Sakshi News home page

Avesh Khan: మరీ అంత ఓవరాక్షన్‌ పనికిరాదు.. హెల్మెట్‌ను నేలకేసి కొట్టి! వీడియో వైరల్‌

Published Tue, Apr 11 2023 9:16 AM | Last Updated on Tue, Apr 11 2023 10:26 AM

Avesh Khan Throws Away Helmet to Celebrate Win - Sakshi

PC: IPL.com

Royal Challengers Bangalore vs Lucknow Super Giants: లక్నో సూపర్‌ జెయింట్స్‌ పేసర్‌, టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ అవేష్‌ ఖాన్‌ తన చర్యతో నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క వికెట్‌ తేడాతో లక్నో థ్రిల్గింగ్‌ విక్టరీ సాధించింది. అయితే లక్నో విజయానికి ఆఖరి ఓవర్‌లో 5 పరుగులు అవసరమయ్యాయి. కీలకమైన చివరి ఓవర్‌ వేసేందుకు ఆర్సీబీ కెప్టెన్‌ డుప్లెసిస్‌ బంతిని హర్షల్‌ పటేల్‌కు ఇచ్చాడు. 

తొలి బంతిని జయదేవ్‌ ఉనద్కట్‌ సింగిల్‌ తీసి వుడ్‌కు స్ట్రైక్‌ ఇచ్చాడు. రెండో బంతికి వుడ్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బిష్ణోయ్‌ మూడో బంతికి రెండు పరుగులు తీశాడు. నాలుగో బంతికి  బిష్ణోయ్‌ సింగిల్‌ తీసి ఉనద్కట్‌కు స్ట్రైక్‌ ఇచ్చాడు. దీంతో స్కోర్లు లెవల్‌ అయ్యాయి. అయితే ఐదో బంతికి ఉనద్కట్‌ పెవిలియన్‌కు చేరాడు. చివరి వికెట్‌గా అవేష్‌ ఖాన్‌ క్రీజులోకి వచ్చాడు.

ఆఖరి బంతికి లక్నో విజయానికి ఒక్క పరుగు అవసరమయ్యింది. హర్షల్‌ వేసిన ఆఖరి బంతిని వికెట్‌ కీపర్‌ దినేష్‌ కార్తీక్‌ అందుకోవడంలో విఫలమకావడంతో.. అవేష్‌-బిష్ణోయ్‌ బై రూపంలో పరుగు తీసి లక్నోకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఆఖరి బంతికి విజయం సాధించగానే లక్నో డగౌట్‌ సంబరాల్లో మునిగి తేలిపోయింది.

అవేష్‌ ఖాన్‌ ఓవరాక్షన్‌..
అయితే విన్నింగ్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకొనే క్రమంలో అవేష్‌ ఖాన్‌ హద్దులు మితిమీరాడు. ఆఖరి బంతికి పరుగు తీసిన వెంటనే అవేష్‌ తన హెల్మెట్‌ను నెలకేసి కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

దీంతో నెటిజన్లు అవేష్‌ ఖాన్‌ను దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. కనీసం బంతినే టచ్‌ చేయలేకపోయావు.. నీకు ఇంత  ఓవరాక్షన్‌ అవసరమా అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో అవేష్‌ ఖాన్‌ దారుణంగా విఫలమయ్యాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు.

చదవండిIPL 2023: అయ్యో హర్షల్‌ పటేల్‌.. ఆ పని ముందే చేయాల్సింది! అలా జరిగుంటేనా! వీడియో వైరల్‌
                    IPL 2023 Dinesh Karthik: ఎంత పనిచేశావు కార్తీక్‌.. లేదంటేనా? అయ్యో ఆర్సీబీ! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement