
వెంకటేశ్ అయ్యర్- ఆవేశ్ ఖాన్(PC: Avesh Khan)
Avesh Khan- Venkatesh Iyer: టీమిండియా యువ పేసర్ ఆవేశ్ ఖాన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. తనకు సంబంధించిన అప్‌డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటాడు. ఈ క్రమంలో నెటిజన్లను ఊపేస్తున్న అరబిక్ కుతూ పాటకు తనదైన శైలిలో స్టెప్పులేశాడు. సహచర క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్‌తో కలిసి డాన్స్ అదరగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆవేశ్ ఖాన్ ఇన్‌స్టాలో షేర్ చేశాడు.
ఈ క్రమంలో నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘‘ఆ ఎక్స్‌ప్రెషన్స్ ఏంటి బాబూ.. ఇద్దరు డాన్స్ చించేశారు. స్టెప్పులతో అదరగొట్టారు. మీ డాన్స్ విజయ్ ఫ్యాన్స్‌కు తప్పక నచ్చుతుంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా తమిళ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'బీస్ట్'లోని అరబిక్ కుతూ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన విషయం తెలిసిందే.
ఇక ఈ యువ క్రికెటర్ల విషయానికొస్తే.. ఐపీఎల్ మెగా వేలం- 2022లో భాగంగా కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్ ఆవేశ్ ఖాన్‌ను 10 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. మరోవైపు.. వెంకటేశ్ అయ్యర్ విషయానికొస్తే.. అతడిని కోల్‌కతా నైట్‌రైడర్స్ 8 కోట్లకు రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు టీమిండియా తరఫున అరంగేట్రం చేశారు. పేసర్‌గా ఆవేశ్ ఖాన్, ఆల్‌రౌండర్‌గా అయ్యర్ తమ కెరీర్‌కు బాటలు వేసుకుంటున్నారు.
చదవండి: IPL 2022: కప్ గెలుస్తారో లేదో తెలీదు.. మా మనసులు దోచుకున్నారు
Comments
Please login to add a commentAdd a comment