టీమిండియా వచ్చే నెలలో విండీస్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ టూర్‌లో భాగంగా భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. జూలై 12న డొమెనికా వేదికగా జరగునున్న తొలి టెస్టుతో భారత పర్యటన ప్రారంభం కానుంది. ఇక విండీస్ టూర్‌కు భారత జట్టును బీసీసీఐ జూన్ 27న ప్రకటించనుంది. కాగా విండీస్ టూర్ ముగిసిన అనంతరం భారత జట్టు ఐర్లాండ్‌కు వెళ్లనుంది. అక్కడ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఐరీష్ జట్టుతో భారత్ తలపడనుంది.
మళ్లీ వస్తా..
ఇక వరుస సిరీస్‌ల నేపధ్యంలో మళ్లీ భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తానని యువ పేసర్ అవేశ్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. "భారత జట్టులో ఉండాలని నేను ఆశిస్తున్నాను. కానీ అది నా చేతిలో లేదు. ప్రతీ ఒక్కరి కెరీర్‌లో ఎత్తు పల్లపల్లాలు ఉంటాయి. నేను రీ ఎంట్రీ ఇచ్చేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాను" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అవేశ్ ఖాన్ పేర్కొన్నాడు.
గతేడాది భారత జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అవేష్ ఖాన్.. పెద్దగా రాణించకపోవడంతో జట్టులో చోటు కోల్పోయాడు. ఇప్పటివరకు టీమిండియా తరపున ఐదు వన్డేలు, 15 టీ20లు ఆడిన అవేష్ ఖాన్ వరుసగా 3, 13 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో కూడా అంతగా రాణించలేకపోయాడు ఐపీఎల్ 2023లో 9 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 8 వికెట్లు మాత్రమే సాధించాడు.
చదవండి: CWC Qualifier 2023: కోహ్లి, బాబర్ ఆజమ్‌లను మించిపోయిన వెస్టిండీస్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment