IPL 203, RR Vs LSG: సారీ బ్రో.. నీలో ఇంత టాలెంట్‌ ఉందా? అస్సలు ఊహించలేదు | Netizens Praise Avesh Khan Bowling Performance Against RR - Sakshi
Sakshi News home page

IPL 2023: సారీ బ్రో.. నీలో ఇంత టాలెంట్‌ ఉందా? అస్సలు ఊహించలేదు

Published Thu, Apr 20 2023 9:51 AM | Last Updated on Thu, Apr 20 2023 10:24 AM

Netizens praises Avesh Khan bowling performance against RR - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో వరుసగా విఫలమవుతున్న లక్నో సూపర్‌ జెయింట్స్‌ పేసర్‌ అవేష్‌ ఖాన్‌.. ఎట్టకేలకు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అవేష్‌ ఖాన్‌ అదరగొట్టాడు. అవేష్‌ ఖాన్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో మూడు వికెట్లు పడగొట్టి 6.20 ఎకానమీ రేటుతో 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 

ముఖ్యంగా హెట్‌మైర్‌, పడిక్కల్‌ వంటి కీలక వికెట్లు పడగొట్టి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఆఖరి ఓవర్‌లో రాజస్తాన్‌ విజయానికి 19 పరుగులు అవసరమవ్వగా.. లక్నో కెప్టెన్‌ బంతిని అవేష్‌ ఖాన్‌ చేతికి ఇచ్చాడు. అవేష్‌ తొలి బంతికి ఫోర్‌ ఇచ్చినప్పటికీ.. తర్వాత అద్భుతమైన కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు. వెంటనే వరుసగా పడిక్కల్‌, జురెల్‌ను పెవిలియన్‌కు పంపాడు.

చివరి ఓవర్‌లో అవేష్‌ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన అతడు 6 వికెట్లు పడగొట్టాడు. కాగా ఇంతకుమందు ఈ ఏడాది సీజన్‌లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో.. అవేష్‌ ఖాన్‌ తన హెల్మెట్‌ను నెలకేసి కొట్టి విమర్శల పాలైన సంగతి తెలిసిందే. అదే విధంగా అతడి బౌలింగ్‌ ప్రదర్శనపై కూడా నెటిజన్లు మీమ్స్‌ వర్షం కురిపించారు.

సారీ బ్రో.. నీలో ఇంతా టాలెంట్‌ ఉందా? 
ఇక అవేష్‌ను విమర్శించిన నోళ్లే ఇప్పుడు ప్రశంసిస్తున్నాయి. డెత్‌ ఓవర్లలో అవేష్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసాడని కొనియాడుతున్నారు. సారీ బ్రో.. నీలో ఇంతా టాలెంట్‌ ఉందా? అస్సలు ఊహించలేదంటూ ఓ యూజర్‌ ‍ట్విట్‌ చేశాడు.
చదవండి: IPL 2023: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. ప్రతీ మ్యాచ్‌లో ఇంతే! తీసి పడేయండి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement