
Photo Courtesy: BCCI/IPL
ఐపీఎల్-2025ను లక్నో సూపర్ జెయింట్స్ ఓటమితో ఆరంభించిన సంగతి తెలిసిందే. సోమవారం(మార్చి 24) వైజాగ్ వేదికగా జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఒక్క వికెట్ తేడాతో అనూహ్యంగా ఓటమి పాలైంది. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్నో బౌలర్లు కాపాడుకోలేకపోయారు.
తొలి 10 ఓవర్లు అద్బుతంగా బౌలింగ్ చేసినప్పటి.. ఆఖరి 10 ఓవర్లలో లక్నో బౌలర్లు తేలిపోయారు. ఢిల్లీ ఆటగాడు అశుతోష్ శర్మ(31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 66 పరుగులు) తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో లక్నో నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.
ఇక లక్నో సూపర్ జెయింట్స్ తమ తదుపరి మ్యాచ్‌లో మార్చి 27న ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు లక్నోకు ఓ గుడ్‌న్యూస్ అందింది. లక్నో సూపర్ జెయింట్స్ శిబిరంలో చేరడానికి స్టార్ పేసర్ అవేష్ ఖాన్‌కు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫిట్ సర్టిఫికేట్ ఇచ్చింది. మోకాలి గాయంతో బాధపడుతున్న అవేశ్ ఖాన్ ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావసం పొందుతున్నాడు.
దీంతో అతడు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో లక్నో ఆడే తొలి మూడు మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ త్వరగా కోలుకున్న అవేష్ ఖాన్.. మార్చి 24(సోమవారం) నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షలో పాసైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు అనుకున్న దానికంటే ముందుగానే లక్నో జట్టుతో చేరనున్నాడు.
కాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అవేష్ లేని లోటు లక్నో జట్టులో కన్పించింది. మరోవైపు లక్నోను గాయాల బెడద వెంటాడుతోంది. స్టార్ పేసర్ మోహ్షిన్ ఖాన్ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌కు ఇప్పటికే దూరం కాగా.. రూ. 11 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకున్న మయాంక్ యాదవ్ టోర్నమెంట్ మొదటి అర్ధభాగానికి దూరమయ్యే అవకాశం ఉంది.
వీరిద్దరితో పాటు ఆకాష్ దీప్ మరో రెండు మ్యాచ్‌లు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో అవేష్ ఖాన్ గాయం నుంచి కోలుకోవడం లక్నోకు భారీ ఊరట కలిగించింది అనే చెప్పాలి. కాగా మోహ్షిన్ ఖాన్ స్ధానంలో స్టార్ ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్‌తో లక్నో ఒప్పందం కుదుర్చుకుంది.
చదవండి: IPL 2025: అశుతోష్ కాదు.. అతడు కూడా హీరోనే! ఎవరీ విప్రాజ్ నిగమ్?
Comments
Please login to add a commentAdd a comment