
రాజ్‌కోట్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో భారత్ 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 2-2తో సమంగా నిలిచింది. అయితే ఈ విజయంలో యువ పేసర్ అవేష్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఆవేష్ ఖాన్ టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
"నాలుగు మ్యాచ్‌ల్లో భారత జట్టులో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఈ క్రెడిట్ మొత్తం ద్రవిడ్ సార్‌కే దక్కుతుంది. అతను ప్రతీ ఒక్కరికి జట్టులో అవకాశాలు ఇస్తారు. ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన కనబర్చినప్పటికీ.. తరువాత మ్యాచ్‌లకు కూడా మనకు ద్రవిడ్ అవకాశం ఇస్తాడు. ఎందుకుంటే ఆటగాడి ప్రతిభను ఒకటి రెండు మ్యాచ్‌లతో అంచనా వేయలేం కదా. ప్రతీ ఒక్కరికి తమను తాము నిరూపించుకోవడానికి తగినన్ని అవకాశాలు ద్రవిడ్ సార్ ఇస్తారు" అని ఆవేష్ ఖాన్ పేర్కొన్నాడు.
స్కోర్లు
టీమిండియా: 169/6
టాప్ స్కోరర్: దినేష్ కార్తీక్
దక్షిణాఫ్రికా: 87/10
ఫలితం: 82 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం
చదవండి: Rishabh Pant: రోజురోజుకు మరింత బలంగా.. పంత్‌కు పొంచి ఉన్న ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment