
ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఓటమి పాలైన టీమిండియా.. ఇప్పుడు రెండో టెస్టుకు సిద్దమవుతోంది. ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా జరగనున్న రెండో టెస్టులో ఎలాగైనా గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని రోహిత్ సేన భావిస్తోంది. అయితే ఈ టెస్టు ఆరంభానికి ముందే భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరమయ్యారు.
దీంతో రెండో టెస్టుకు సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను సెలక్టర్లు భారత ప్రధాన జట్టులో చేర్చారు. ఇక రెండు టెస్టుకు రాహుల్ దూరం కావడంతో మధ్యప్రదేశ్ ఆటగాడు రజిత్ పాటిదార్ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. తొలి టెస్టుకు బెంచ్‌కే పరిమితమైన పాటిదార్.. వైజాగ్ టెస్టుకు మాత్రం తుది జట్టులోకి తీసుకోవాలని మేనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
పాటిదార్‌కు దేశీవాళీ క్రికెట్‌లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 55 మ్యాచ్‌లు ఆడిన పాటిదార్.. 4000 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 12 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: విరాట్ కోహ్లి నాపై ఉమ్మేశాడు.. రెండేళ్ల తర్వాత: సౌతాఫ్రికా మాజీ కెప్టెన్