IND Vs ENG 2nd Test: తొలిరోజు జైస్వాల్‌ సూపర్‌ ‘హిట్‌’.. | IND Vs ENG 2nd Test Match Live Score Updates In Telugu, Highlights And Viral Videos - Sakshi
Sakshi News home page

IND Vs ENG 2nd Test Updates: తొలిరోజు జైస్వాల్‌ సూపర్‌ ‘హిట్‌’..

Published Fri, Feb 2 2024 8:57 AM | Last Updated on Fri, Feb 2 2024 5:33 PM

IND Vs ENG 2nd Test Match Live Score Updates In Telugu, Highlights And Viral Videos - Sakshi

India vs England, 2nd Test At Vizag Day 1 Update: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. వైజాగ్‌లో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి.. 93 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి  336 పరుగులు చేసింది. ఓపెనర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(14) నిరాశపరచగా.. మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు.

ఆట ముగిసే సరికి 179 పరుగులతో అశ్విన్‌(5)తో అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో శుబ్‌మన్‌ గిల్‌(34), అరంగేట్ర బ్యాటర్‌ రజత్‌ పాటిదార్‌(32) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లంతా నామమాత్రంగానే ఆడారు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఈ టెస్టులో  ఇంగ్లండ్‌ బౌలర్లలో స్పిన్నర్లు షోయబ్‌ బషీర్‌, రెహాన్‌ అహ్మద్‌లకు రెండు చొప్పున వికెట్లు దక్కగా.. దిగ్గజ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌, స్పిన్‌ బౌలర్‌ హార్లీ ఒక్కో వికెట్‌ పడగొట్టాడు.

ఆరో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
90.6: శ్రీకర్‌ భరత్‌ రూపంలో టీమిండియా ఆరో వికెట్‌ కోల్పోయింది. రెహాన్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో షోయబ్‌ బషీర్‌కు క్యాచ్‌ ఇచ్చి భరత్‌ (17) పెవిలియన్‌ చేరాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 330-6(91)

88వ ఓవర్‌ ముగిసే సరికి టీమిండియా స్కోరు: 307/5
యశస్వి జైస్వాల్‌ 168, శ్రీకర్‌ భరత్‌ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఐదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
►85.3: షోయబ్‌ బషీర్‌ బౌలింగ్‌లో రెహాన్‌ క్యాచ్‌ ఇచ్చిన అక్షర్‌ పటేల్‌. 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఐదో వికెట్‌గా వెనుదిరిగిన ఆల్‌రౌండర్‌. లోకల్‌ స్టార్‌ శ్రీకర్‌ భరత్‌ క్రీజులోకి వచ్చాడు. 

టీమిండియా @ 300
►84: మూడు వందల పరుగుల మార్కు అందుకున్న టీమిండియా

73 ఓవర్లలో టీమిండియా స్కోరు: 250-4
►యశస్వి 142, అక్షర్‌ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
71.1: ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ రెహాన్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో రజత్‌ పాటిదార్‌ బౌల్డ్‌(32). నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్‌. యశస్వి, అక్షర్‌ పటేల్‌ క్రీజులో ఉన్నారు.

63 ఓవర్లలో టీమిండియా స్కోరు: 225/3
జైస్వాల్‌ 125, పాటిదార్‌ 25 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. టీ విరామ సమయానికి భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.

మూడో వికెట్‌ డౌన్‌..
శ్రేయస్‌ అయ్యర్‌ రూపంలో టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. 27 పరుగులు చేసిన శ్రేయస్‌ అయ్యర్‌.. టామ్‌ హార్లీ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌కు ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి అరంగేట్ర ఆటగాడు రజత్‌ పాటిదార్‌ వచ్చాడు.

యశస్వీ జైశ్వాల్‌ సూపర్‌ సెంచరీ..
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో జైశ్వాల్‌ అద్బుత సెంచరీతో చెలరేగాడు. 151 బంతుల్లో జైశ్వాల్‌ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. జైశ్వాల్‌కు ఇది రెండో టెస్టు సెంచరీ. 50 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 175/2. క్రీజులో జైశ్వాల్‌(104), శ్రేయస్‌ అయ్యర్‌(23) పరుగులతో ఉన్నారు.

42 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 137/2
42 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్‌ జైశ్వాల్‌(69) దూకుడుగా ఆడుతున్నాడు.  అతడితో పాటు శ్రేయస్‌ అయ్యర్‌(21) పరుగులతో క్రీజులో ఉన్నాడు.

38 ఓవర్లకు భారత స్కోర్‌: 114/2
38 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్‌(56), శ్రేయస్‌ అయ్యర్‌(14) పరుగులతో ఉన్నారు.

లంచ్‌ విరామానికి భారత్‌ స్కోర్‌: 103/2
రెండో టెస్టు తొలి రోజు లంచ్‌ విరామానికి భారత్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్‌(51), శ్రేయస్‌ అయ్యర్‌(4) పరుగులతో ఉన్నారు.

జైశ్వాల్‌ హాఫ్‌ సెంచరీ
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జైశ్వాల్‌ తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 51 పరుగులతో జైశ్వాల్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

శుబ్‌మన్‌ గిల్‌ ఔట్‌..
89 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. 34 పరుగులు చేసిన శుబ్‌మన్‌ గిల్‌.. జేమ్స్‌ ఆండర్స్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 29 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 89/2, క్రీజులోకి శ్రేయస్‌ అయ్యర్‌ వచ్చాడు. జైశ్వాల్‌(41) పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

రోహిత్‌ శర్మ అవుట్‌
17.3: రోహిత్‌ శర్మ రూపంలో టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. ఇంగ్లండ్‌ యువ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ మాయాజాలంలో చిక్కుకున్న టీమిండియా కెప్టెన్‌ ​ ఒలీ పోప్‌నకు క్యాచ్‌ ఇచ్చి 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. గిల్‌ క్రీజులోకి వచ్చాడు. యశస్వి 26 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 41/1 (18)

నిలకడగా ఆడుతున్న రోహిత్‌, జైశ్వాల్‌..
15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్‌: 39/0, క్రీజులో యశస్వీ జైశ్వాల్‌(25), రోహిత్‌ శర్మ(14) పరుగులతో ఉన్నారు.

పది ఓవర్లకు టీమిండియా స్కోరు: 23/0
యశస్వి, రోహిత్‌ ఆచితూచి ఆడుతున్నారు. 10 ఓవర్లు ముగిసేసరికి యశస్వి 13, రోహిత్‌ పది పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఐదు ఓవర్లకు టీమిండియా స్కోరు: 14/0
యశస్వి 9, రోహిత్‌ ఆరు పరుగులతో ఆడుతున్నారు.

ఖాతా తెరిచిన జైశ్వాల్‌.. 2 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 9/0
తొలి ఇన్నింగ్స్‌లో 2 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్‌(9), రోహిత్‌ శర్మ(0) ఉన్నారు.

విశాఖపట్నం వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ రెండో టెస్టు ప్రారం‍భమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో రజిత్‌ పాటిదార్‌ భారత్‌ తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌కు స్టార్‌ ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌, రవీం‍ద్ర జడేజా గాయం కారణంగా దూరంగా కాగా.. పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు మేనెజ్‌మెం‍ట్‌ విశ్రాంతి ఇచ్చింది.

ఈ క్రమంలో పాటిదార్‌తో పాటు ముఖేష్‌ ​కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి వచ్చారు. మరోవైపు ఇంగ్లండ్‌ రెండు మార్పులతో బరిలోకి దిగింది. యువ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ అరంగేట్రం చేయగా.. వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ తుది జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు:
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్‌కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్

ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్‌), బెన్ ఫోక్స్(వికెట్‌ కీపర్‌), రెహాన్ అహ్మద్, టామ్ హార్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement