దక్షిణాఫ్రికాతో కీలకమైన మూడో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. పార్ల్ వేదికగా గురువారం జరగనున్న ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భారత జట్టు కసితో ఉంది. కాగా తొలి మ్యాచ్‌లో సునాయస విజయాన్ని అందుకున్న రాహుల్ సేన.. రెండో వన్డేలో మాత్రం బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమయ్యి ఔటమి పాలైంది. దీంతో సిరీస్ 1-1 సమమైంది.
ఈ క్రమంలో ఇరు జట్లకు మూడో వన్డే కీలకంగా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు వన్డేల్లో దారుణంగా విఫలమైన హైదారాబాదీ తిలక్ వర్మపై వేటు పడే ఛాన్స్ ఉంది. అతడి స్ధానంలో మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పటిదార్ వన్డేల్లో అరంగేట్రం చేసే సూచనలు కన్పిస్తున్నాయి.
అదే విధంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు ఈ మ్యాచ్‌కు మేనెజ్‌మెంట్ విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. కుల్దీప్ స్ధానంలో మరో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సౌతాఫ్రికా మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశముంది.
తుది జట్లు(అంచనా)
దక్షిణాఫ్రికా: రిజా హెండ్రిక్స్, టోనీ డి జోర్జి, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, లిజాద్ విలియమ్స్, బ్యూరాన్ హెండ్రిక్స్
భారత్:రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, రజిత్ పాటిదార్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), సంజు శాంసన్, రింకు సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment