![Rajat Patidars poor Form Continues As Harpreet Brar Cleans Him Up - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/25/patdar.gif.webp?itok=Z_aX9uV4)
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్. ఆర్సీబీ ఆటగాడు రజిత్ పాటిదార్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్-2024 తొలి మ్యాచ్‌లో విఫలమైన పాటిదార్.. ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదే తీరును కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 18 బంతులు ఎదుర్కొన్న పాటిదార్ కేవలం 18 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన పాటిదార్ తన ఆట తీరుతో నిరాశరిచాడు.
పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ హార్‌ప్రీత్ బరార్ బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి పాటిదార్ క్లీన్ బౌల్డయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అన్న నీవు మారవా ఇంకా ఎన్ని మ్యాచ్‌లు ఇలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది ఆర్సీబీ మెనెజ్‌మెంట్‌ను తప్పుబడుతున్నారు.
ఫామ్‌లో లేని ఆటగాడికి ఎందుకు ఛాన్స్‌లు ఇస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. అంతకుముందు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ పాటిదార్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
177 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. ఆర్సీబీ బ్యాటర్లో విరాట్ కోహ్లి(49 బంతుల్లో 77, 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఆఖరిలో దినేష్ కార్తీక్ మెరుపు మెరిపించి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందిచాడు. కేవలం 10 బంతులు ఎదుర్కొన్న కార్తీక్.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
— Sitaraman (@Sitaraman112971) March 25, 2024
Comments
Please login to add a commentAdd a comment