
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు రజిత్ పాటిదార్ ఆట ఏ మాత్రం మారలేదు. ఈ మెగా ఈవెంట్‌లో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ పాటిదార్ నిరాశపరిచాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన పాటిదార్.. రస్సెల్ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో అతడిని ఆర్సీబీ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ‘‘ఇకనైనా నీ ఆట తీరు మారదా’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఆర్సీబీ మెనెజ్‌మెంట్ తీరును తప్పుబడుతున్నారు.
అతడు వరుసగా విఫలమవుతున్నప్పటికి అవకాశాలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా రాబోయే మ్యాచ్‌ల్లో పాటిదార్‌పై ఆర్సీబీ వేటు వేసే ఛాన్స్ ఉంది. అతడి స్ధానంలో మహిపాల్ లామ్రోర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశముంది.
కాగా ఐపీఎల్‌కు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ పాటిదార్ దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పుడు అదే పేలవ ఫామ్‌ను పాటిదార్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇక మ్యాచ్‌లో ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది.
Rajat patidar 😭😭 pic.twitter.com/MXrogYrPNw
— ADITYA 🇮🇳 (@troller_Adi18) March 29, 2024
Comments
Please login to add a commentAdd a comment