మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్ అద్భుత శతకం సాధించాడు. హర్యానాతో మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉన్న వేళ మెరుపు శతకంతో ఆదుకున్నాడు. కేవలం 68 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా ఆఖరి రోజు ఆటలో మధ్యప్రదేశ్‌ను పటిష్ట స్థితిలో నిలపగలిగాడు.
కాగా రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో భాగంగా తొలుత కర్ణాటకతో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న మధ్యప్రదేశ్.. తదుపరి పంజాబ్‌తో మ్యాచ్‌లోనూ ఫలితం తేల్చలేకపోయింది. ఈ క్రమంలో శనివారం ఇండోర్ వేదికగా హర్యానా జట్టుతో రెడ్‌బాల్ మ్యాచ్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది.
తొలి ఇన్నింగ్స్‌లో 308
ఓపెనర్ హిమాన్షు మంత్రి(97) సహా కెప్టెన్ శుభం శర్మ(44), హర్‌ప్రీత్ సింగ్(36) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు చేయగలిగింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హర్యానా 440 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ లక్ష్య దలాల్ సెంచరీ(105)తో చెలరేగగా.. హిమాన్షు రాణా 90, ధీరూ సింగ్ 94, హర్షల్ పటేల్ 81 పరుగులతో దుమ్ములేపారు.
ఆధిక్యంలోకి హర్యానా
దీంతో తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ కంటే 132 పరుగుల ఆధిక్యంలో నిలిచింది హర్యానా. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ ఆరంభంలోనే ఓపెనర్లు సాగర్ సోలంకి(32), వెంకటేశ్ అయ్యర్(28) వికెట్లు కోల్పోయింది.
రజత్ మెరుపు శతకం
ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన రజత్ పాటిదార్ 68 బంతుల్లోనే ధనాధన్ ఇన్నింగ్స్‌తో శతకం సాధించాడు. మరో ఎండ్‌లో హర్‌ప్రీత్ సింగ్(44), శుభం శర్మ(38 నాటౌట్) సహకారం అందించగా.. పట్టుదలగా క్రీజులో నిలబడి 102 బంతుల్లో 159 పరుగులు చేశాడు.
టార్గెట్ 177
ఈ క్రమంలో 48.1 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 308 పరుగుల వద్ద ఉండగా మధ్యప్రదేశ్ తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. పాటిదార్ మెరుపు శతకం వల్ల మంగళవారం నాటి ఆఖరి రోజు ఆటలో భాగంగా హర్యానాకు 177 పరుగుల లక్ష్యం విధించగలిగింది.
ఆర్సీబీకి స్ట్రాంగ్ మెసేజ్
ఇక ఐపీఎల్-2025 మెగా వేలం సమీపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబరు 31 నాటికి ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాలను సమర్పించనున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి సమయంలో రజత్ పాటిదార్ సెంచరీ సాధించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) యాజమాన్యానికి రేసులో తానూ ఉన్నాననే సందేశం ఇచ్చాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా గత కొన్నేళ్లుగా ఆర్సీబీకి ఆడుతున్న రజత్ పాటిదార్.. ఈ ఏడాది 395 పరుగులు సాధించాడు.
చదవండి: IPL 2025: వాషింగ్టన్ సుందర్ కోసం ఎగబడుతున్న ఫ్రాంఛైజీలు
Comments
Please login to add a commentAdd a comment