స్వదేశంలో రేపటి నుంచి (జనవరి 18) న్యూజిలాండ్‌తో ప్రారంభం కాబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. వెన్నెముక గాయం కారణంగా స్టార్ మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కొద్ది సేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. శ్రేయస్ స్థానాన్ని రజత్ పాటిదార్‌తో భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. గాయపడ్డ శ్రేయస్ అయ్యర్‌ను నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపింది.
కాగా, ఇటీవలి కాలంలో శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా లంకతో జరిగిన వన్డే సిరీస్ మినహా అంతకుముందు అతనాడిన అన్ని సిరీస్‌ల్లో అంచనాల మేరకు రాణించాడు. ఇప్పటివరకు 7 టెస్ట్‌లు, 40 వన్డేలు, 49 టీ20లు ఆడిన శ్రేయస్.. 3 సెంచరీలు, 26 అర్ధసెంచరీల సాయంతో 3232 పరుగులు చేశాడు. మరోవైపు శ్రేయస్ స్థానంలో వన్డే జట్టులోకి వచ్చిన పాటిదార్‌కు ఇప్పటివరకు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రాలేదు.
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా (అప్‌డేటెడ్)..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, చహల్
Comments
Please login to add a commentAdd a comment