ఆఖరి వన్డే: రికార్డు సొంతం చేసుకున్న అయ్యర్‌ | India Vs New Zealand 3rd ODI Shreyas Iyer Clinch A Record | Sakshi
Sakshi News home page

ఆఖరి వన్డే: రికార్డు సొంతం చేసుకున్న అయ్యర్‌

Published Tue, Feb 11 2020 10:32 AM | Last Updated on Wed, Feb 12 2020 7:56 AM

India Vs New Zealand 3rd ODI Shreyas Iyer Clinch A Record - Sakshi

మౌంట్‌ మాంగనీ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత్‌ 40 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లకు 217 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (1), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (9) నిరాశ పరచగా.. ఓపెనర్‌ పృథ్వీ షా (42 బంతుల్లో 40; ఫోర్లు 3, సిక్స్‌లు 2) రెండో పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌ అయ్యాడు. లోకేష్‌ రాహుల్‌తో కలిసి జట్టుకు 100 పరుగులు జతచేసిన శ్రేయాస్‌ అయ్యర్‌ (63 బంతుల్లో 62; ఫోర్లు 4) నీషమ్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం లోకేష్‌ రాహుల్‌ 76, మనీష్‌ పాండే 26 పరుగులతో క్రీజులో ఉన్నారు.

9 హాఫ్‌ సెంచరీలతో..
అర్ధ సెంచరీ సాధించే క్రమంలో అయ్యర్‌ వన్డేల్లో ఓ అరుదైన రికార్డును సాధించాడు. 10 కన్నా ఎక్కువ మ్యాచ్‌లలో అత్యధిక హాఫ్‌ సెంచరీల సగటు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 16 మ్యాచ్‌లు ఆడిన అయ్యర్‌ 9 అర్ధ సెంచరీలు చేశాడు. ఫలితంగా అత్యధిక హాఫ్‌ సెంచరీల సగటు 56.25 సగటు నమోదు చేశాడు. తర్వాతి స్థానాల్లో ఇయాన్‌ చాపెల్‌ 16 మ్యాచ్‌లలో 8, ఆకిబ్ ఇలియాస్ 10 మ్యాచ్‌లలో 5 హాఫ్‌ సెంచరీలు (సగటు 50)తో ఉన్నారు. అన్షుమన్‌ రథ్‌ 18/8 -సగటు 44.44, డేర్‌ డస్సన్‌ 16/7 -సగటు 43.75, టెన్‌ డోషెట్‌ 32/14 -సగటు 43.75 మిగతా స్థానాల్లో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement