రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు రజత్ పాటిదార్ జాక్‌పాట్ కొట్టాడు. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు కోహ్లికి రీప్లేస్‌మెంట్‌గా ఎంపికయ్యాడు. ఇటీవలే ఇంగ్లండ్ లయన్స్‌పై వరుస సెంచరీలతో (111, 151) విరుచుకుపడిన పాటిదార్ ఎంపిక ముందుగానే ఊహించిందే. 30 ఏళ్ల పాటిదార్ సీనియర్లైన పుజారా, రహానే, యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, రియాన్ పరాగ్‌ల నుంచి పోటీ ఎదుర్కొన్నప్పటికీ.. అంతిమంగా సెలెక్టర్లు ఈ మధ్యప్రదేశ్ ఆటగాడివైపే మొగ్గు చూపారు.
గతేడాది చివర్లో జరిగిన సౌతాఫ్రికా పర్యటనలో వన్డే క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పాటిదార్.. ఆ సిరీస్‌లో కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడి 22 పరుగులతో పర్వాలేదనిపించాడు. రైట్ హ్యాండ్ బ్యాటింగ్, రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన పాటిదార్ తాను ప్రాతినిథ్యం వహించిన జట్ల తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగేవాడు. అయితే ఇంగ్లండ్ సిరీస్‌లో అతనికి అవకాశం వస్తే మాత్రం కోహ్లి స్థానమైన నాలుగో ప్లేస్‌లో బరిలోకి దిగాల్సి ఉంటుంది.
ఒకవేళ టీమిండియా మేనేజ్‌మెంట్ శుభ్‌మన్ గిల్‌కు అవకాశం కల్పించాలని భావిస్తే పాటిదార్ బెంచ్‌కు పరిమితం కాక తప్పదు. ఇలా జరగకపోతే మాత్రం పాటిదార్ టెస్ట్ అరంగేట్రం దాదాపుగా ఖాయమైపోయినట్లే. 2021 సీజన్‌లో ఆర్సీబీ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన పాటిదార్.. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడి సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 404 పరుగులు చేశాడు. కాగా, టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల చేత ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు దూరమైన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జనవరి 25 నుంచి ప్రారంభంకానుంది. తొలి రెండు టెస్ట్‌ల కోసం భారత జట్టును ఇదివరకే ప్రకటించారు. అందులో పాటిదార్‌కు చోటు దక్కలేదు. కొద్ది రోజుల కిందట కోహ్లి తొలి రెండు టెస్ట్‌లకు అందుబాటులో ఉండడని తెలియడంతో సెలెక్టర్లు పాటిదార్‌ను అతని ప్రత్యామ్నాయంగా ఎంపిక చేశారు.
ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్), కేఎస్ భరత్ (వికెట్‌కీపర్), ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment