ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన టీమిండియా ఆటగాడు, ఆర్సీబీ మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పాటిదార్.. ఇప్పుడు ఐపీఎల్-2024లోనూ అదే తీరును కనబరిచాడు. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తొలి మ్యాచ్‌లో పాటిదార్ దారుణంగా విఫలమయ్యాడు. 3 బంతులు ఎదుర్కొన్న పాటిదార్.. ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.
ఆర్సీబీ ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి ఎటువంటి ఫుట్ మూమెంట్ లేకుండా ఆఫ్ సైడ్ వైపు ఆడటానికి పాటిదార్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి అతడి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ ధోని చేతికి వెళ్లింది. ధోని ఎటువంటి తప్పిదం చేయకుండా రెగ్యులేషన్ క్యాచ్‌ను అందుకున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఇదేమి ఆటరా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీపై చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18. 4 ఓవర్లలో ఛేదించింది. సీఎస్‌కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(37) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శివమ్ దూబే(34 నాటౌట్), రవీంద్ర జడేజా(25 నాటౌట్) రాణించారు.
కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆర్సీబీని అనుజ్ రావత్(48), దినేష్ కార్తీక్(38 నాటౌట్) తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో అదుకున్నారు. వీరితో పాటు కెప్టెన్ డుప్లెసిస్(35) పరుగులతో రాణించాడు. సీఎస్‌కే బౌలర్లలో ముస్తుఫిజర్ రెహ్మాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
All Happening Here!
— IndianPremierLeague (@IPL) March 22, 2024
Faf du Plessis ✅
Rajat Patidar ✅
Glenn Maxwell ✅@ChennaiIPL bounced back & in some style 👏 👏#RCB are 3 down for 42 in 6 overs!
Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE
Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y#TATAIPL |… pic.twitter.com/tyBRQJDtWY
Comments
Please login to add a commentAdd a comment