టీమిండియా స్టార్, ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 12000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా విరాట్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి ఈ ఘనతను అందుకున్నాడు.
టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు 376 మ్యాచ్‌లు ఆడిన కింగ్ కోహ్లి.. 41.21 సగటు, 133.42 స్ట్రయిక్‌రేట్‌తో 12000 పరుగులు చేశాడు. . ఇందులో 8 సెంచరీలు, 91 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్‌గా వరల్డ్ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఆరో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు.
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విండీస్ వీరుడు క్రిస్ గేల్ (14562) టాప్‌లో ఉండగా.. పాక్ షోయబ్ మాలిక్ (13360), విండీస్ పోలార్డ్ (12900), ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ (12319), ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (12065) తర్వాతి స్ధానాల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో విరాట్ చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment