రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత జట్టు.. ఇప్పుడు నాలుగో టెస్టుకు సన్నదమవుతోంది. ఫిబ్రవరి 23 నుంచి రాంఛీ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకోవాలని రోహిత్ సేన వ్యూహాలు రచిస్తోంది.
అయితే ఈ మ్యాచ్‌కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని జట్టు మేనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మూడో టెస్టుకు ముందు జట్టు నుంచి రిలీజ్ అయిన పేసర్ ముఖేష్ కుమార్ తిరిగి మళ్లీ రాంఛీ టెస్టుకు అందుబాటులో వచ్చే ఛాన్స్ ఉంది.
పాటిదార్ పై వేటు..
ఇక వరుసగా వైజాగ్,రాజ్‌కోట్ టెస్టులకు గాయం కారణంగా దూరమైన భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో అతడు నాలుగో టెస్టు జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉండడం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలో మిడిలార్డర్ బ్యాటర్ రజిత్ పాటిదార్‌పై వేటు పడే సూచనలు కన్పిస్తున్నాయి.
వైజాగ్ టెస్టుతో అరంగేట్రం చేసిన పాటిదార్.. పెద్దగా అకట్టుకోలేకపోయాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం రాజ్‌కోట్ టెస్టులో అయితే ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు దారుణంగా విఫలయ్యాడు.
రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే అతడి వేటు వేయాలని భారత జట్టు మేనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అరంగేట్రంలోనే అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురల్ స్ధానాలకు ఎటువంటి ఢోకా లేదు.
చదవండి: SL vs AFG: దుమ్ములేపుతున్న శ్రీలంక.. వరుసగా మూడో సిరీస్ విజయం
Comments
Please login to add a commentAdd a comment