రాంఛీ వేదికగా ఇంగ్లండ్ జరుగుతున్న నాలుగో టెస్టులో భారత యువ ఆటగాడు ధృవ్ జురెల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. క్లిష్ట పరిస్ధితుల్లో తన విరోచిత పోరాటంతో జట్టును దృవ్ అదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు చేసి ఇంగ్లండ్ ఆధిక్యాన్ని తగ్గించాడు.
టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగుల మెరుగైన స్కోర్ చేయడంలో దృవ్‌ది కీలక పాత్ర. ఈ క్రమంలో ధృవ్ జురెల్‌పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో జురెల్‌ను లిటిల్ మాస్టర్ పోల్చాడు.
"ధృవ్ జురెల్ ఒక అద్బుతమైన ఆటగాడు. అతడి ఏకాగ్రత, అంకిత భావం చూస్తుంటే మరో ఎంఎస్ ధోని అవుతాడని నాకు అన్పిస్తోంది. ఈ మ్యాచ్‌లో జురెల్ తన తొలి సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. కానీ ఇదే ఏకగ్రాతతో ఆడితే భవిష్యత్తులో ఎన్నో సెంచరీలు సాధిస్తాడని" స్పోర్ట్స్ 18లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సన్నీ పేర్కొన్నాడు. కాగా ఓవరాల్‌గా 149 బంతులు ఆడిన ధ్రువ్ రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 90 పరుగులు చేశాడు.
సెంచరీ చేయడం ఖాయం అనుకునే దశలో టామ్ హార్ట్‌లీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎనిమిదో వికెట్‌కు కుల్దీప్ యాదవ్‌తో కలిసి ధ్రువ్ 76 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఇక రాంఛీ టెస్టులో భారత్ విజయం దిశగా అడుగులు వేస్తోంది.192 పరుగుల లక్ష్యఛేదనలో మూడో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(24), యశస్వీ జైశ్వాల్ ఉన్నారు.
చదవండి: IND vs ENG: ఏంటి సర్ఫరాజ్.. హీరో అవ్వాలనుకుంటున్నావా? రోహిత్ సీరియస్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment