ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత వికెట్ కీపర్ మరోసారి తన స్కిల్స్‌ను ప్రదర్శించాడు. తన సమయస్ఫూర్తితో ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్‌ను జురెల్ బోల్తా కొట్టించాడు.
ఏం జరిగిందంటే?
భారత కెప్టెన్ రోహిత్ శర్మ తొలి రోజు లంచ్ విరామానికి ముందు 26 ఓవర్ వేసే బాధ్యతను కుల్దీప్ యాదవ్‌కు అప్పగించాడు. ఆ ఓవర్‌లో తొలి బంతిని జాక్ క్రాలే సింగిల్ తీసి ఓలీ పోప్‌కు ఇచ్చాడు. పోప్ రెండో బంతికి ఢిపెన్స్ ఆడటానికి ప్రయత్నించగా.. అది మిస్స్ అయ్యి వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ చేతికి వెళ్లింది. అయితే జురెల్ కుల్దీప్ వద్దకు వెళ్లి తర్వాతి బంతికి పోప్ క్రీజును వదిలి ఆడుతాడని చెప్పాడు.
యాదృచ్ఛికంగా జురెల్ చెప్పటినట్లగానే పోప్ క్రీజును వదలి బయటకు వచ్చి డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే ధ్రువ్ సూచనతో కుల్దీప్ టర్న్ ఎక్కువగా చేయడంతో బంతి జురెల్ బ్యాట్‌కు మిస్స్ అయ్యి వికెట్ కీపర్ చేతికి వెళ్లింది.
వెంటనే జురెల్ బెయిల్స్‌ను పడగొట్టి స్టంపౌట్ చేశాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జురెల్ స్కిల్స్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ధోనిని గుర్తు చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: IND vs ENG: ఎంత పనిచేశావు రోహిత్? అంతా ధ్రువ్ వల్లే! పాపం సర్ఫరాజ్
Comments
Please login to add a commentAdd a comment