రాజస్తాన్‌ దర్జాగా... | Rajasthan Royals another step towards playoffs | Sakshi
Sakshi News home page

రాజస్తాన్‌ దర్జాగా...

Published Sun, Apr 28 2024 3:47 AM | Last Updated on Sun, Apr 28 2024 3:47 AM

Rajasthan Royals another step towards playoffs

ప్లేఆఫ్స్‌ దిశగా మరో అడుగు 

7 వికెట్లతో లక్నోపై గెలుపు 

రాణించిన సామ్సన్, జురేల్‌ 

లక్నో: ఈ సీజన్‌లో తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్న రాజస్తాన్‌ రాయల్స్‌ అందరికంటే ముందుగా ప్లేఆఫ్స్‌ చేరేందుకు మరింత చేరువైంది. శనివారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాజస్తాన్‌ 7 వికెట్ల తేడాతో లక్నోపై గెలిచింది. తొలుత లక్నో సూపర్‌జెయింట్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.

ఆరంభంలోనే ఓపెనర్‌ డికాక్‌ (8), హిట్టర్‌ స్టొయినిస్‌ (0) వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్న సూపర్‌జెయింట్స్‌ను కేఎల్‌ రాహుల్‌ (48 బంతుల్లో 76; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీపక్‌ హుడా (31 బంతుల్లో 51; 7 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 115 పరుగులు జోడించారు.

మిగతావారిలో పూరన్‌ (11), బదోని (18 నాటౌట్‌), కృనాల్‌ పాండ్యా (15 నాటౌట్‌) పెద్ద స్కోర్లేమీ చేయలేదు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.

కెప్టెన్  సంజు సామ్సన్‌ (33 బంతుల్లో 71 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), ధ్రువ్‌ జురేల్‌ (34 బంతుల్లో 52 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 121 పరుగులు జోడించి మరో ఆరు  బంతులు మిగిలి ఉండగానే గెలిపించారు.  

స్కోరు వివరాలు 
లక్నో సూపర్‌జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (బి) బౌల్ట్‌ 8; రాహుల్‌ (సి) బౌల్ట్‌ (బి) అవేశ్‌ ఖాన్‌ 76; స్టొయినిస్‌ (బి) సందీప్‌ 0; దీపక్‌ హుడా (సి) పావెల్‌ (బి) అశి్వన్‌ 50; పూరన్‌ (సి) బౌల్ట్‌ (బి) సందీప్‌ 11; బదోని నాటౌట్‌ 18; కృనాల్‌ నాటౌట్‌ 15; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–8, 2–11, 3–126, 4–150, 5–173. బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–41–1, సందీప్‌ 4–0–31–2, అవేశ్‌ ఖాన్‌ 4–0–42–1, అశ్విన్‌ 4–0–39–1, చహల్‌ 4–0–41–0.  

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (సి) బిష్ణోయ్‌ (బి) స్టొయినిస్‌ 24; బట్లర్‌ (బి) యశ్‌ ఠాకూర్‌ 34; సామ్సన్‌ నాటౌట్‌ 71; పరాగ్‌ (సి) బదోని (బి) అమిత్‌ 14; జురేల్‌ నాటౌట్‌ 52; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–60, 2–60, 3–78. బౌలింగ్‌: హెన్రీ 3–0–32–0, మొహసిన్‌ 4–0–52–0, యశ్‌ ఠాకూర్‌ 4–0–50–1, స్టొయినిస్‌ 1–0–3–1, కృనాల్‌ 4–0–24–0, అమిత్‌ మిశ్రా 2–0–20–1, రవి బిష్ణోయ్‌ 1–0–16–0.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement